బాలీవుడ్ లో చాలానే ప్రేమ జంటలు ఉన్నాయి కానీ వారిలో క్రేజీ జంట మాత్రం మలైకా అరోరా - అర్జున్ కపూర్లదే. కారణం అందరికీ తెలిసిందే. అర్జున్ వయసు 33 అయితే మలైకా వయసు 45. ఇద్దరికీ పన్నెండేళ్ళ తేడా. ఇక మలైకా అర్బాజ్ ఖాన్ నుండి డైవోర్స్ తీసుకుందని.. టీనేజ్ వయసు కుమారుడు ఉన్నాడని అందరికీ తెలిసిందే. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టే అర్జున్ - మలైకా జోడీ సెగలు రేపుతోంది. ఈ జోడీ అంటే నచ్చని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఇద్దరినీ ట్రోలింగ్ కూడా చేస్తుంటారు.
సరే.. అవన్నీ పక్కన పెడితే ఈ జంట మొదట్లో కాస్త మొహమాటంగా ప్రవర్తించేవారు కానీ ఈమధ్య అరమరికలు లేకుండా తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రీసెంట్ గా ఆస్ట్రియా దేశానికి ఓ రొమాంటిక్ హాలిడే కోసం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి కొన్ని ఫోటోలు కూడా ఇన్స్టా ఖాతాల ద్వారా పంచుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇద్దరి మ్యారేజ్ గురించి చాలా రోజుల నుంచి బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈ జంట పెళ్ళి గురించి బాలీవుడ్ లో ఒక క్రేజీ టాక్ వచ్చింది. మలైకాకు పెళ్ళి అసలు ఇష్టం లేదట. అర్జున్ పెళ్ళి చేసుకుందామని మలైకాను కోరుతున్నా ఒప్పుకోవడం లేదట. గతంలో పెళ్ళి తనకు అచ్చిరాలేదని.. మరో సారి వివాహ బంధంలో అడుగు పెట్టడం ఇష్టం లేదని అంటోందట. ఇలానే తమ బంధాన్ని కొనసాగిస్తే మేలని అర్జున్ కు చెప్పిందట.
నిజంగా మలైకా ఆ మాట చెప్పిందో లేదో దేవుడెరుగు.. "మలైకా ఆ మాట చెప్పింది" అన్నట్టుగా బాలీవుడ్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే మలైకా తన జీవితంలో అన్నీ చూసేసింది కాబట్టి ఇట్టాంటి లాజిక్కులు ఎన్నైనా చెప్తుంది. మరి అర్జున్ సంగతేం కావాలి? ఏంటో ఈ బాలీవుడ్ యవ్వారాలు.. మనకు కొరుకుడుపడేవి కాదు.!