లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా మిగిలిన అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరో లేకుండా కేవలం కంటెంట్ మీద క్రేజ్ తీసుకొచ్చి ఒక రోజు ముందే వేసిన ప్రీమియర్ షోలన్ని కిక్కిరిసిపోయేలా చేయటం దీనికే చెల్లింది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో హీరొయిన్లు విజయ్ దేవరకొండ-శాలిని పాండే లకు దక్కుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. దీనికి వివిధ బాషలలో రిమేక్ చేసుకోవడానికి భారీ డిమాండ్ ఉంది. తమిళ్ లో విక్రం వారసుడు హీరోగా బాలా దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్ కాగా కన్నడలో యష్ హీరోగా దీన్ని తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందిలో కూడా అర్జున్ రెడ్డి కోసం భారీ డిమాండ్ నెలకొని ఉంది. మొదట వరుణ్ ధావన్ హీరోగా ఇది తెరకెక్కిస్తారు అనే వార్తలు వచ్చాయి కాని ఇప్పుడు హీరో మారాడు అనేది తాజాగా టాక్.
బోనీ కపూర్ మొదటి భార్య తనయుడు అర్జున్ కపూర్ ఇందులో నటించడం దాదాపు ఖాయం అయ్యిందని టాక్. మురద్ ఖేతాని అనే నిర్మాత భారీ మొత్తానికే హక్కులు కొన్నట్టు వార్త. హిందీ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మామూలుగానే బోల్డ్ కంటెంట్ ని ఆదరించే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి లాంటి సబ్జెక్టులు బాగా కనెక్ట్ అవుతాయి. రాక్ స్టార్ - దేవ్ డి లాంటి సినిమాలు, అనురాగ్ కశ్యప్ తీసే బోల్డ్ మూవీస్ అన్ని ఇవే క్యాటగిరీలో ఉంటాయి. సో అర్జున్ రెడ్డి యూనివర్సల్ సబ్జెక్టు అనే నమ్మకంతో దీన్ని పకడ్భందీగా తీసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడిగా ఒరిజినల్ వెర్షన్ టేకప్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఉండేలా చర్చలు జరుగుతున్నాయి కాని అవి ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. హీరొయిన్ సెలక్షన్, టెక్నికల్ టీం అన్ని ఫైనల్ అయ్యాక ఈ ఏడాది సమ్మర్ లోనే షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.