బాలీవుడ్ యంగ్ హీరో ఇద్దరి భామల మధ్యలో పడి నలిగిపోతున్నాడా? ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు భార్యలిద్దరు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. ఇంతకీ ఆ ఇద్దరి భార్యల ముద్దుల మొగుడు ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఏవండి ఆవిడ వచ్చింది..ఆయనకు ఇద్దరు .. ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు లాంటి టైటిల్స్ ఉన్న చిత్రాలు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో చెప్పాల్సిన పనిలేదు.
ఒకప్పటి రోజుల్లో ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. ఫ్యామిలీ నేపథ్యమున్న సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టేవారు. ముఖ్యంగా తెలుగు..హిందీ భాషల్లో ఈ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. వినోదమే ప్రధానంగా కనిపించేది. కాలక్రమంలో ఆ తరహా చిత్రాలు కనుమరుగైపోయాయి. అప్పుడప్పుడు బాలీవుడ్ మాత్రం ఈ తరహా ప్రయత్నాలు చేస్తుంది.
తాజాగా అలాంటి ప్రయత్నమే ఇదొకటిగా కనిపిస్తుంది. ఇద్దరు భార్యలు..ఓ భర్త కథాంశంతో వస్తోన్న చిత్రం `మేరీ హజ్బెండ్ కీ బీవీ`..ఇందులో ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు పాత్రలో అర్జున్ కపూర్ నటించగా..ఓ భార్యగా రకుల్ ప్రతీ్ సింగ్...మరో భార్యగా భూమి పడ్నేకర్ నటిస్తున్నారు. ముదాస్సర్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమాని నేటి యువత ..ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా ఆద్యంతం రొమాంటిక్ ఎంటర్ టైనింగ్ చిత్రంగా మలిచినట్లు తెలుస్తోంది. ఇద్దరి భార్యలతో విసుగుపోయిన భర్త ఇబ్బందల్ని మరోసారి వెండి తెరపై ఆవిషర్కించినట్లు కనిపిస్తుంది. సినిమాలో ఘాటైన రొమాన్స్ సన్నివేశాలకు కొదవలేదంటోంది చిత్ర బృందం. రకుల్ తో ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేనక ఆకర్షణగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. అందులో రకుల్ --అర్జున్ కపూర్ పై ఈ సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. రకుల్ ఈ పాత్రని ఎంతో ఎంజాయ్ చేసిందిట. భర్తకు భార్య రోల్ పోషించడం ఇదే తొలిసారి అని ...ఇంత వరకూ తాను పోషించిన పాత్రలకు భిన్నంగా తెరపై కనిపించడంపై సంతోషం వ్యక్తం చేసింది. అలాగే భూమి పడ్నేకర్ తోనూ అద్భుతమైన కెమిస్ర్టీ వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తిచేయాలన్నది టీమ్ ప్లాన్. అటుపై నిర్మాణానంతర పనులు పూర్తిచేసి జూన్ కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.