బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ హర్టయ్యాడు. హిందీ దినపత్రిక అమర్ ఉజాలా ఓ వార్తకు పెట్టిన శీర్షిక అతణ్ని బాధించింది. ‘తో ఇస్ లియే అర్జున్ కపూర్ కో చోడ్కర్ చలీ గయీ ఉన్ కి మా’ అనే హెడ్డింగ్ పెట్టి ఒక వార్త ప్రచురించింది ఆ పత్రిక. ‘‘అర్జున్ కపూర్ ను అతడి తల్లి వదిలేసి వెళ్లిపోయింది ఇందుకే’’.. ఇదీ ఆ హెడ్డింగ్ అర్థం. ఇంతకీ హెడ్డింగ్ తో రాసిన వార్త వెనుక ఒక స్టోరీ ఉంది.
అర్జున్ కపూర్ సూపర్ హిట్ మూవీ ‘2 స్టేట్స్’లో అతడికి అమ్మగా అమృతాసింగ్ నటించింది. అర్జున్ కొత్త సినిమా ‘ముబారకాన్’లోనూ అమృతాసింగ్ నే అతడికి తల్లిగా తీసుకుందామనుకున్నారు. ఐతే డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. ఈ విషయం మీదే వార్త రాస్తూ ఆ హెడ్డింగ్ పెట్టారు. ఐతే ఈ హెడ్డింగ్ అర్జున్ కపూర్ వ్యక్తిగత జీవితానికి రిలేటయ్యేలా ఉండటంతో వచ్చింది సమస్య.
అర్జున్ కపూర్ తల్లి మోనా కపూర్ నాలుగేళ్ల కిందటే చనిపోయింది. దీంతో అతడి తల్లి అతణ్ని ఎందుకు వదిలి వెళ్లిపోయిందో చెబుతున్నట్లుగా ఉంది ఈ హెడ్డింగ్. దీనిపై అర్జున్ హర్టయ్యాడు. ‘‘నా గురించి ఏమీ రాసినా నేను సాధారణంగా స్పందించను. కానీ తల్లిని కోల్పోయిన వ్యక్తిగా నన్ను ఈ శీర్షిక తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా పరుషంగా ఉంది’’ అని ట్విట్టర్లో స్పందించాడు అర్జున్. ఐతే తాము అర్జున్ సినిమా తల్లి విషయంలోనే ఈ వార్త రాశామని.. అతణ్ని హర్ట్ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని ఆ పత్రిక వివరణ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/