లాయర్ సాబ్ (PSPK 26) చిత్రీకరణ సాగుతుండగానే.. వరుసగా రెండు ప్రాజెక్టులను ఖాయం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఓవైపు PSPK 27 చిత్రాన్ని దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ జానర్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ కి యూనిట్ రెడీ అవుతోంది. పవన్ రాజకీయ వ్యవహారాలకు బ్రేక్ ఇచ్చి తిరిగొచ్చిన వెంటనే యూనిట్ యథావిథిగా పవన్ పై షూటింగును కొనసాగించనుంది. ఈ గ్యాప్ లో ఇతర ప్రధాన తారాగణం పై సీన్స్ ని తెరకెక్కించనున్నారు.
పవన్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. `మహానటి` సినిమాతో ఈ మలయాళీ భామకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తెలుగు సినిమా చేస్తుందని భావిస్తే.. బాలీవుడ్ లో `మిస్ ఇండియా` అనే ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమాకి కమిటైంది. అలాగే తమిళ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.
తాజాగా PSPK 27 కోసం బాలీవుడ్ స్టార్లను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే విలన్ పాత్రకు ఏకంగా బాలీవుడ్ హీరోనే దించేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కి ఉత్తరాదిన ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడిని మెయిన్ విలన్ గా ఒప్పించే ప్రయత్నాల్లో దర్శకుడు క్రిష్ ఉన్నాడుట. ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేసే ఆలోచన ఉంది కాబట్టి నటీనటుల పరంగా బాలీవుడ్ కి ప్రాధాన్యతనిస్తున్నారట. అర్జున్ రాంపాల్ తో పాటు ఇరుగు పొరుగు భాషల నటీనటులు పీఎస్ పీకే 27 లో కనిపిస్తారట.