విజయ్ దేవరకొండ- షాలిని పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో సంచలన విజయం సాధించి బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేకై అక్కడా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ విజయ్ దేవరకొండకు అక్కడ షాహిద్ కి అమాంతం మైలేజ్ ని పెంచిన సినిమాలివి. కథానాయికలకు కూడా గొప్ప పేరు వచ్చింది. కెరీర్ పరంగా ఎదురేలేని స్థాయికి ఎదిగేస్తున్నారు. షాలిని ప్రస్తుతం పలు క్రేజీ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుండగా కియరా సౌత్ నార్త్ రెండు చోట్లా బిజీగా ఉంది.
ఇకపోతే గొప్ప విజయాల నేపథ్యంలో అర్జున్ రెడ్డి సీక్వెల్ కథ రెడీ అవుతోందా? కబీర్ సింగ్ సీక్వెల్ ని తెరకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటూ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది.
తాజాగా భూషణ్ కుమార్ -మురాద్ ఖేతానీ కాంబో రూపొందించిన హారర్ కామెడీ భూల్ భూలయా 2 విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ - కియరా ప్రధాన పాత్రల్లో అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భూలయ్యా 2 ఇప్పటికే 60కోట్లు వసూలు చేసింది. 2010 బ్లాక్ బస్టర్ కబీర్ సింగ్ తర్వాత టీసిరీస్ వారికి ఇది రెండవ పెద్ద విజయం. ఓ ఇంటర్వ్యూలో నిర్మాతల ద్వయం కబీర్ సింగ్ ను కూడా ఫ్రాంచైజీగా మార్చాలని చూస్తున్నట్లు ధృవీకరించారు.
ఫ్రాంచైజీగా అభివృద్ధి చేయాలని భావించే ప్రాజెక్ట్ ల గురించి భూషణ్-మురాద్ జోడీని అడిగినప్పుడు.. భూషణ్ కుమార్ నవ్వుతూ.. "నేను అనుకుంటున్నది చెబుతాను.. మా చిత్రం కబీర్ సింగ్ ఖచ్చితంగా ఫ్రాంచైజీగా మారుతుంది. ఇది ఐకానిక్ క్యారెక్టర్ ..రెండవ భాగంలో తీసుకోవచ్చు" అని అన్నారు. మురాద్ ఖేతానీ దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. "అవును.. ఆ పాత్ర చాలా ప్రజాదరణ పొందింది. అతని కోసం ఒక కథ గురించి ఆలోచించాలి" అని అంగీకరించారు.
మురాద్ తన నిర్మాత భూషణ్ కుమార్ త్వరలో ఆషికి మూడవ భాగాన్ని నిర్మించడానికి సన్నాహకాల్లో ఉన్నారు. భూల్ భూలయ్యా2 విజయంతో పార్ట్ 3 తెరకెక్కిస్తున్నారా? అని ప్రశ్నించగా.. "మేము ఖచ్చితంగా భూల్ భులయ్యా ఫ్రాంచైజీని ముందుకు తీసుకువెళుతున్నాము. మునుముందు తగినంత స్కోప్ ఉంది. మేము సరైన సమయంలో మరిన్ని వివరాలను ప్రకటిస్తాము" అని ఇద్దరూ సమాధానం ఇచ్చారు.
భూషణ్- మురాద్ తమ తదుపరి చిత్రం 'యానిమల్' గురించి సంతోషంగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్ పెద్ద స్క్రీన్ వినోదానికి సరైన కాన్సెప్ట్ అని భూషణ్ హామీ ఇచ్చారు. "ఇది చాలా ఆసక్తికరమైన స్క్రిప్ట్ .. హీరోయిజం.. సంగీతం.. ఎంట్రీ.. ఇంటర్వెల్ బ్లాక్.. ఫాదర్ ఎమోషన్.. మదర్ ఎమోషన్.. స్కేల్ .. యాక్షన్ వంటివి పెద్ద స్క్రీన్ లలో చూసేఆరికి సంబంధించిన అన్ని ఎలిమెంట్ లను కలిగి ఉన్న స్క్రిప్ట్ ఇది. సందీప్ రెడ్డి వంగా దక్షిణాది నుండి వచ్చినందున హిందీ మాట్లాడే ప్రేక్షకుల సెన్సిబిలిటీని అర్థం చేసుకున్నాడు. నిజానికి వారి సెన్సిబిలిటీ మేము 1970లు.. 80లలో తీసిన సినిమాల తరహాలోనే ఉంది. సౌత్ ఇండస్ట్రీ కేవలం ఆ చిత్రాలను రీప్యాక్ చేసి వాటిని పెద్ద ఎత్తున రూపొందిస్తోంది. మేము ఇక్కడ చేయడం లేదు" అని అతను చెప్పాడు. యానిమల్ లో రణబీర్ కపూర్- అనిల్ కపూర్- రష్మిక మందన్న- బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.