ఎన్నారైలు ఆ సినిమాలే చూస్తారా?

Update: 2017-08-30 06:24 GMT
ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. ఓ కొత్త కాన్సెప్ట్ ఏదైనా క్రియేట్ అయినపుడే ఆ విషయం తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ కలెక్షన్స్ కు కీలకమైన ఏరియాగా మారిపోయింది ఓవర్సీస్. ముఖ్యంగా నార్త్ అమెరికా నుంచి వచ్చే వసూళ్లు.. చాలా ముఖ్యం అయిపోయాయి. అయితే.. అక్కడి జనాల టేస్ట్ పై ఇప్పటివరకూ ఓ అపోహ మాత్రం నిలిచిపోయింది.

ఎన్నారైలు క్లాస్ సినిమాలు మాత్రమే చూస్తారు.. కామెడీ ఉంటే సినిమాలను ఆదరిస్తారు.. మాస్ మూవీస్ వాళ్లను ఎట్రాక్ట్ చేయలేవు.. లాంటి మాటలు చాలానే వింటూ ఉంటాం. అయితే.. ఇవన్నీ ట్రాష్ అని ప్రూవ్ చేశారు మెగాస్టార్. పక్కా మాస్ మూవీ ఖైదీ నంబర్ 150తో.. 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి చిరంజీవి ఓ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డితో మరో కొత్త రికార్డ్ సెట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి అన్ని ఏరియాలతో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్లను ఇరగదీస్తున్న అర్జున్ రెడ్డి.. ఓవర్సీస్ లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ ను దాటేసింది.

అయితే.. 1 మిలియన్ అని అనడం కంటే.. ఎన్నారైలు ఏవి చూస్తారు ఏవి చూడరు అనే అంశమే ముఖ్యం. ఎందుకంటే.. అర్జున్ రెడ్డి "ఏ" సర్టిఫికేట్ మూవీ. యూఎస్ ఏ లో మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి ఏ సర్టిఫికేట్ ఫిలిం అర్జున్ రెడ్డి. కామెడీ.. ఫ్యామిలీ సినిమాలు మాత్రమే ఎన్నారైలు చూస్తారని అనుకుంటున్న వారికి.. అర్జున్ రెడ్డి ఇచ్చిన షాక్ మామూలుది కాదు. కంటెంట్ కరెక్ట్ గా కనెక్ట్ చేయగలిగితే.. ఎలాంటి సినిమాకి అయినా అమెరికా ఆడియన్స్ నుంచి ఆదరణ ఉంటుందని.. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ నిరూపించాడు.
Tags:    

Similar News