GSTపై గొంతెత్తిన మరో తమిళ్ హీరో

Update: 2017-07-05 04:36 GMT

జూలై 1 నుండి అమలులోకి వచ్చిన GST విధానంపై వివిధ రంగాల వాళ్ళు వివిద రకాలుగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. బ్యాంక్లో పనిచేసిన వాడు ఒక విధంగా, ఐ‌టి లో పని చేసేవాడు ఒక రకంగా మీడియా - ఫిల్మ్ ఇండస్ట్రి వాళ్ళు మరో విధంగా వాళ్ళ ఇక్కట్లను వెలబుచ్చుతున్నారు. మామూలు సరుకులు పై కాకుండా ఆర్ధిక వ్యవస్థ కు పన్నులు రూపంలో ముడిపడి ఉన్న అన్నీ ఎగుమతులు దిగిమతుల వస్తువులు పై విధించే పన్నులో చాలా వరకు పెరగటంతో సర్వత్ర మిశ్రమ స్పందన వస్తోంది. దీని పరిణామాలు ఎలా ఉన్నా మధ్యతరగతి మనిషి మాత్రం నలిగిపోతున్నాడు అనే చెప్పాలి. సినిమా పరిశ్రమ పై కూడా ఈ కొత్త పన్ను విధానం కొంత ప్రభావం చూపుతుంది.  

అయితే GST విషయంలో తమిళ్ సినిమా వర్గాలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయి. తమిళ్ సినిమాలో ప్రముఖ నటులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని దైర్యంగానే చెబుతున్నారు. స్టార్స్ మాత్రమే కాదు అక్కడ థియేటర్ ఓనర్స్ - డిస్ట్రిబూటర్స్ ఈ విషయంలో పూర్తిగా అసంతృప్తి తో ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ గా కొందరు స్టార్స్ కూడా వాళ్ళ గొంతుకు బలం చేకూరుస్తున్నారు. కొత్త GST విధానానికి నిరసనగా థియేటర్లు బంద్ కూడా ప్రకటించారు అక్కడ. ఇది ఇలా ఉంటే యాక్షన్ హీరో అర్జున్ తన అభిప్రాయాన్ని చెప్పాడు “ కొత్త టాక్స్ విధానం వలన లోకల్ టాక్స్ పై ప్రభావం చూపుతుందిని దాని వలన ఇండస్ట్రి ఇబ్బందులు పడుతుంది. దీని వలన ఎవరూ సినిమాలో పెట్టుపడి పెట్టడానికి ముందుకు రారు. సేవ్ తమిళ సినిమా'' అన్నాడు. సినిమాకు - సినిమాకు సంబంధించిన ఏ అపశృతి జరిగిన వెంటనే తమిళ్ వాళ్ళు అంతా ఒకటై ఒకే మాట పై ఉంటున్న వాళ్ళ నుండి ఈ ఐక్యత పాఠం మొత్తం దేశం నేర్చుకోవాలిసిందే.

తమిళ్ థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబూటర్స్ చేస్తున్న ఆందోళన రానురానూ పెరిగిపోతుందో. తొందరలో గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చి ఈ విషయం పై కొన్ని మార్పులు చేసి ఇటువంటి వ్యతిరేకత భావాన్ని జనాల్లో లేకుండా ఉండేలా ఒక కొత్త విధానం చేస్తారు అని అందరూ ఆశాభావంతో ఉన్నారు.


Tags:    

Similar News