ఫ్రైడే వస్తోందంటే సందడే సందడి. థియేటర్లలో కొత్త సినిమాల హల్ చల్ మామూలుగా లేదు. ఆ రోజు ఎంతో మంది జాతకాలు తారుమారు అవుతుంటాయి. హిట్టొస్తే ఒకలా.. ఫ్లాపైతే ఇంకోలా జాతకం మారుతుంటుంది. ఏడాదికి 52 శుక్రవారాలు ఉన్నాయి అనుకుంటే ఇప్పటికే ఓ ఐదారు శుక్రవారాలు మినహా 2019 ఫ్రైడేస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. గత ఫ్రైడే రిలీజైన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక ఫ్రై అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు కొత్తగా ట్రై చేసినా లక్ కలిసిరాలేదు. సక్సెస్ యథావిధిగా 5-10శాతం లోపే ఉంది. ఇంతకీ ఈ ఫ్రైడే ఎవరిది? ఈసారి ఫ్రై అయ్యేది ఎవరు?.. పోరులో నెగ్గేది ఎవరు? అన్న చర్చ సాగుతోంది. ఈ శుక్రవారం అరడజను చిత్రాలు రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి.
వివాదాల రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న `కమ్మరాజ్యంలో` కడపరెడ్లు` ప్రచారార్భాటంతో రిలీజవుతోంది. హత్యా రాజకీయాలు.. కుల రాజకీయాలే కేంద్ర బిందువుగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇదే రోజున ఆర్జీవీకి పోటీగా నిఖిల్ వార్ లోకి రావడం ఆసక్తికరం. అతడు నటించిన అర్జున్ సురవరం కొన్ని అవాంతరాల్ని దాటుకుని ఎట్టకేలకు రిలీజవుతోంది. నిఖిల్ ని గత కొన్ని నెలలుగా ఊరిస్తూ అష్టకష్టాలు పెడుతున్న `అర్జున్ సురవరం` అతడికి ఎలాంటి రిజల్ట్ నివ్వబోతోంది అన్న క్యూరియాసిటీ నెలకొంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా కమ్మరాజ్యంలో.. చిత్రానికి పోటీనిస్తుందన్న ఆశ పెరిగింది.
ఇక గత కొన్నేళ్లుగా రిలీజ్ కి నోచుకోక ల్యాబుకే అంకితమైన `రఘుపతి వెంకయ్య` చిత్రం ఈ వారంలో రిలీజ్ అవుతోంది. సినిమాకి ఆద్యుడైన రఘుపతి వెంకయ్య జీవితకథతో తీసిన సినిమాగా ఇది. సీనియర్ నరేష్ టైటిల్ పాత్ర పోషించారు. అలాగే అంతా కొత్త వాళ్లతో నిర్మించిన `రాజావారు రాణివారు` రాబోతోంది.
గత కొంత కాలంగా గౌతమ్ మీనన్ కు చుక్కలు చూపిస్తున్న `తూటా` కూడా తమిళ- తెలుగు భాషల్లో ఇదే రోజున రిలీజ్ కు సిద్ధమవుతోంది.
వీటిల్లో ఏ సినిమా ఈ ఫ్రైడే రోజున గెలుపు గుర్రం ఎక్కుతుంది? ఏ సినిమా ఫ్రై కాబోతోంది? అన్నది సస్పెన్స్ గా మారింది. నిఖిల్ ని `అర్జున్ సురవరం` గండం నుంచి గట్టెక్కిస్తుందా? లేదా లేకపోతే వర్మ కుల వర్గ కుమ్ములాట నేపథ్యంలో రూపొందిస్తున్న `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` అనుకున్న స్థాయిలో ఆకట్టుకుంటుందా? అన్నది తేలాలంటే ఈ నెల 29 వరకు వేచి చూడాల్సిందే.