అదేంటి బాహుబలి 2 వచ్చి రెండేళ్లు అవుతోంది ఇప్పుడీ బాకీల ప్రస్తావన ఏమిటి అనుకుంటున్నారా. సినిమా తెరమీద చూడటం వరకే మనం పరిమితమవుతాం కానీ అంతకు మించి ఆర్థిక వ్యవహారాలు వెనుక చాలా జరుగుతాయి. కొన్ని సార్లు ఏళ్ళు కూడా పట్టేలా సాగతీతకు గురవుతాయి. అలాంటిదే ఇది కూడా.
బాహుబలి 2 తమిళ వెర్షన్ ని పంపిణి చేసింది ఎస్ రాజరాజన్. కె ప్రొడక్షన్స్ సంస్థ పేరు మీద ఆయన బాహుబలి 2 వ్యవహారాలన్నీ నడిపారు. బాక్స్ ఆఫీస్ బూజు దులిపేలా భారీ వసూళ్లు దక్కాయి. బ్లాక్ బస్టర్ అందుకుంది. టాప్ త్రి లో చోటు దక్కించుకుని ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డులు సొంతం చేసుకుంది. కానీ విడుదల సమయం నుంచే ఒరిజినల్ నిర్మాతలైన ఆర్కా సంస్థకు ఈ కె ప్రొడక్షన్స్ నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి
కట్ చేస్తే ఇప్పుడు 17 కోట్ల 60 లక్షల బకాయిలు ఇంకా రావలసి ఉందని తేలింది. ఈ మేరకు సదరు సంస్థకు లీగల్ నోటీసులు కూడా పంపించేశారు. చెక్ ఇచ్చినప్పటికీ తగినన్ని నిధులు లేకపోవడం అది కాస్తా బౌన్స్ అయ్యింది. దానికి తోడు ఇంత మొత్తానికి సరిపడే సెక్యూరిటీని చూపడం కె సంస్థ ఫెయిల్ కావడంతో ఇది ఇంకా సంక్లిష్టంగా మారింది.
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల ద్వారా కోర్ట్ తో ఆదేశాలు తెప్పించుకునే విధంగా ఆర్కా సంస్థ చర్యలు చేపట్టింది. పైకి వందల కోట్లు వసూలు చేసినా బాహుబలి బిజినెస్ వెనుక ఇలాంటి బాధలు గాధలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. సదరు రాజరాజన్ మాత్రం దీని గురించి స్పందించేందుకు ఎంత ప్రయత్నించినా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు