సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటేనే చాలు.. ఆ ప్రాజెక్టుకు ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. పైగా వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’కు సీక్వెల్ అనేసరికి రోబో-2 మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇది చాలదన్నట్లు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ విలన్ రోల్ చేస్తున్నాడనగానే సినిమా రేంజే మారిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టకుండానే సినిమాకు విపరీతమైన హైప్ వచ్చేసింది. రోబో-2తో ఇండియన్ సినిమా రేంజే మారిపోతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఇప్పుడు రోబో-2 యూనిట్ కు పెద్ద షాక్ తగిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు నుంచి ఆర్నాల్డ్ తప్పుకున్నట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవలే శంకర్ తో పాటు రోబో-2ను నిర్మించబోతున్న లైకా ప్రొడక్షన్ అధినేతలు అమెరికా పర్యటన చేశారు. రోబో-2 కోసం కొందరు హాలీవుడ్ టెక్నీషియన్లతో సంప్రదింపులు జరపడంతో పాటు ఆర్నాల్డ్ తోనూ కమిట్ మెంట్ తీసుకోవడం కోసం జరిపిన పర్యటన ఇది. ఐతే ఈ సందర్భంగా ఆర్నాల్డ్ అలవిమాలిన కోరికలు కోరాడని.. అతడి డిమాండ్లను తట్టుకోలేక తనకు గుడ్ బై చెప్పేద్దామన్న ఆలోచనకు శంకర్ వచ్చాడని సమాచారం. ఆర్నాల్డ్ వల్ల ప్రాజెక్టుకు వచ్చే క్రేజ్ సంగతేమో కానీ.. అతడి డిమాండ్లన్నీ తీర్చి సినిమా తీయడం చాలా కష్టమని అనుకుంటున్నారట. డిసెంబరు 12న రజినీ పుట్టిన రోజు సందర్భంగా ‘రోబో-2’ గురించి ముందు అనౌన్స్ మెంట్ ఇవ్వాలని అనుకున్నా.. ఆ తర్వాత వెనక్కి తగ్గడానికి కూడా అదే కారణమట. ఆర్నాల్డ్ విషయంలో నిజానిజాలేంటన్నది ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశముంది.