గాడిదతో సూపర్ స్టార్ ఆట..

Update: 2020-03-31 16:16 GMT
హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ ఫాలోయింగ్ మాములుగా లేదు. 72 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ చాలామంది యంగ్ స్టార్స్‌ కు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కలిగిన హాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆర్నాల్డ్ - రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ గా రాణించారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న ఆయన, అక్కడున్న పరిస్థితుల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

మొదటి నుంచి అందరికీ భిన్నంగా ఆలోచించే ఆర్నాల్డ్ గుర్రాన్ని, గాడిదను పెంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్వారంటైన్ సమయంలో ఈ పెంపుడు జంతువులతోనే కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా గాడిదతో చెస్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్నాల్డ్. గాడిదతో చెస్ ఆడడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నానని, కుటుంబంతో కలిసి చెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంత సమయం వెచ్చించాలంటూ ట్వీట్ చేశాడు. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఈ జంతువులను ఆర్నాల్డ్, తన సొంత కుటుంబీకులుగా చూసుకుంటున్నాడు.

2015లో వచ్చిన ‘ఐ’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌ కు ఆర్నాల్డ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రోబో 2.0’ సినిమాలో విలన్‌గా మొదట ఆర్నాల్డ్‌నే అనుకున్నారు. అయితే ఈ హాలీవుడ్ సూపర్ స్టార్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ విని, షాకైన శంకర్ అండ్ టీమ్... చివరకు ఆ పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను తీసుకున్నారు. ఆర్నాల్డ్ ప్రస్తుతం ‘కుంగ్ ఫ్యూరీ 2’ అనే యాక్షన్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ మూవీలో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు కూడా బ్రేక్ పడింది.
Tags:    

Similar News