తాకితే కరిగిపోతుందా అనిపించే బొమ్మ అది. మనిషి నులివెచ్చని శరీరం తాకినా కరిగే స్వభావం ఉన్న బొమ్మ. పూర్తిగా మైనంతో చేసిన బొమ్మ. ఆ బొమ్మను దగ్గరగా చూడాలని వచ్చింది ఓ బామ్మ. అంతేకాదు.. ఓ ఫోటో దిగితే ఎలా ఉంటుంది? అని దగ్గరకు వెళ్లింది. అంతే ఆ బొమ్మలో చలనం వచ్చింది. నేను నిజమే అంటూ మాటలు కూడా మాట్లాడింది. షాకవ్వడం భామ్మగారి వంతు.
అయితే ఆ తర్వాత నేను ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్‌ని. నిజంగానే ప్రాణం ఉన్న మనిషిని అని చెప్పాక కానీ సదరు బామ్మగారు తేరుకోలేకపోయారు. ఆ తర్వాత ఆ అభిమాని ఆర్నాల్డ్‌తో సెల్ఫీ దిగి వెళ్లిపోయింది. ఇదంతా మ్యాడమ్ తుస్సాడ్స్‌లో జరిగిన ఘటన. అయితే ఆర్నాల్డ్ ఇలా మైనపు బొమ్మలా మారిపోవడానికి కారణం? ఏమిటి? అని ఆరాతీస్తే అది ఓ చారిటీ కోసమేనని తెలిసింది. మైనపు బొమ్మ రూపంలోనే అక్కడ వీధుల్లో తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి ఓ పాఠశాల విద్యార్థుల కోసం వినియోగించారు.
లండన్‌లోని మ్యాడమ్ తుస్సాడ్స్ గురించి తెలిసిందే. ఇక్కడ ప్రముఖుల మైనపు బొమ్మలు వరుసగా నిలబెట్టి ఉంటాయి. వీటిలో మన దేశానికి చెందిన ప్రముఖ నటీనటుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్ ఇలా ప్రముఖుల మైనపు బొమ్మలు తుస్సాడ్స్‌లో ఉన్నాయి. వీటితో పాటే వరుసలో ఆర్నాల్డ్ కూడా మైనపు బొమ్మలా నిలుచున్నారన్నమాట! అది గుర్తించలేని అభిమానికి ఇలాంటి అనుభవం ఎదురైంది.