రాజకీయమే నన్ను నా పిల్లలకు దూరం చేసింది: స్టార్ యాక్టర్ ఆవేదన

Update: 2021-06-22 01:30 GMT
సినిమా ఇండస్ట్రీలో అందరూ సెలబ్రిటీస్ అయితే బాగుంటుందని అనుకుంటారు. కానీ ఆ సెలబ్రిటీ జీవితంలో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. కానీ వాటి ఎప్పుడు కూడా కెమెరా ముందు చెప్పుకోరు సెలబ్రిటీలు. ఎందుకంటే ఫేవరేట్ యాక్టర్స్ ఎల్లప్పుడూ ఫ్యాన్స్ ఓ అంచనాలో ఉంటారు. ఇలాంటి విషయాలు బయటపెడితే అభిమానులు కూడా నిరాశకు గురవుతారు. ఆ ఉద్దేశంతోనే సినీ సెలబ్రిటీలు అన్ని విషయాలు షేర్ చేసుకోలేరు. అందులోను ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ దృష్ట్యా ఇలా వార్త అందిందో లేదో అలా ప్రపంచానికి తెలిసిపోతుంది.

అందుకే సినిమా వాళ్లు అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు ఇష్టపడరు. కానీ ఎప్పుడైతే ఫామ్ కోల్పోయి ఇంటర్వ్యూలలో పాల్గొంటారో అప్పుడే చెప్పాలనుకున్న విషయాలన్నీ దాచుకోకుండా బయటపెట్టేస్తారు. అయితే కన్నబిడ్డలే అసహ్యంగా చూసిన పరిస్థితిని ఎదుర్కొన్నాడట హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగ్గర్‌. ఈ 73ఏళ్ల సీనియర్ యాక్టర్ ఇటీవలే తన లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారని భావించిన పిల్లలు తనను దూరం పెట్టారని చెబుతూ వాపోయాడు. మరి అసలు ఏం జరిగింది అంటే.. రాజకీయం అనేది తన బిడ్డలకు అసహ్యం కలిగేలా చేసిందని చెప్పుకొచ్చాడు.

తన వ్యక్తిగత విషయాల గురించి ఆర్నాల్డ్ మాట్లాడుతూ.. "నేను నటుడుగా సక్సెస్ అయిన తర్వాత పాలిటిక్స్ లో చేరి గవర్నర్‌గా గెలిచాక నా పిల్లలు చాలా హ్యాపీ అవుతారని అనుకున్నా. కానీ నా విషయంలో సీన్ రివర్స్ అయింది. వాళ్లు ఆ టైంలో నా పదవితో పాటు నన్ను కూడా అసహ్యించుకున్నారు. ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను. చిన్నప్పటి నుండి వాళ్లు నా సినిమాలు చూస్తూ పెరిగారు. నాతో పాటు షూటింగ్ సెట్స్‌లోకి వచ్చి ఆడుకునేవారు. అలాంటి వాతావరణం వారికీ చాలా హ్యాపీగా అనిపించింది. తీరా నేను సినిమాలు ఆపేసి రాజకీయాలతో వాళ్లను హాలీవుడ్‌ నుండి దూరం చేయడం నచ్చలేదు. పైగా గవర్నర్ గా నేను కాలిఫోర్నియాను అభివృద్ధి చేయలేదని అనుకుంటున్నారు. కానీ పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు. వాళ్లు అపార్ధం చేసుకున్నారు. ఆ విధంగా ద్వేషించడం మొదలుపెట్టారు" అంటూ ఎమోషనల్ అయిపోయాడు ఆర్నాల్డ్. ఇదిలా ఉండగా ఆర్నాల్డ్ చివరిగా టర్మినేటర్ డార్క్ ఫేట్ లో కనిపించాడు.
Tags:    

Similar News