బాలీవుడ్ లో ఖాన్ ల మధ్య గొడవల గురించి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వర్సెస్ షారూక్ ఖాన్ వర్గపోరు ఎపిసోడ్స్ తెలిసిందే. రకరకాల విభేధాలతో నైట్ పార్టీల్లో గొడవలు అటుపై కలతలు కల్లోలాలు అదంతా బాలీవుడ్ సినీవర్గాలు సహా అన్నిచోట్లా వైరల్ గా తెలిసిన విషయమే. అయితే ఆ ఇద్దరూ చాలా కాలం పాటు బెట్టు వీడక ఎదురు పడినా ముఖాముఖాలు చూసుకోలేదు. కానీ ఇటీవల అంతా మారింది. ఆ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అంత పెద్ద బద్ధ శత్రువుల్ని ఏకం చేసినది ఎవరు? ఆ ఎలిమెంట్ ఏమిటి? అన్నది ఆరా తీస్తే ఆసక్తికర సంగతే తెలిసింది.
అసలు ఆ ఇద్దరి మధ్యా శత్రుత్వం తొలగిపోవడానికి అసలు కారణం సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ అన్న సంగతి తెలిసింది తక్కువమందికే.
అర్పితా ఖాన్ - ఆయుష్ శర్మ వివాహం షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ మధ్య శత్రుత్వాన్ని ఐస్ గడ్డలా కరిగించింది. కొన్నేళ్లుగా మాటలు లేకపోయినా ఆ పెళ్లితో అన్నిటినీ వదిలేశారు. 2014 లో అర్పితా ఖాన్ వివాహంలో ఒకరితో ఒకరు కలిసిపోయారు.
నిజానికి ఆ ఇద్దరికీ గొడవ ఎక్కడ మొదలైంది? అన్నది వెతికితే.. కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలో ప్రారంభమైన ఫికర్ సంవత్సరాల పోరాటంగా మారింది. ఆ తర్వాత చివరికి 2014 లో అర్పిత దానికి సొల్యూషన్ ఇచ్చింది.
షారూఖ్ - సల్మాన్ .. ఓసారి బాబా సిద్దిక్ వార్షిక ఇఫ్తార్ పార్టీలో కౌగిలించుకున్నా.. నెమ్మదిగా అది అర్పిత-ఆయుష్ వివాహంలో అంతమైంది. హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో గ్రాండ్ వెడ్డింగ్ కి కొన్ని రోజుల ముందు జరిగిన కార్యక్రమానికి సల్మాన్ ఆహ్వానం మేరకు షారుఖ్ హాజరయ్యారు. “నేను ఖచ్చితంగా వెళ్తాను. అర్పిత చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. నేను ఆమెను నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె నాకు సోదరి లాంటిది. నిజానికి నాకు ఆహ్వానం కూడా అవసరం లేదు. వారు మా కుటుంబం లాంటివారు. నేను వెళ్తాను`` అంటూ షారూక్ అప్పట్లో ఎమోషన్ అయ్యారు.
షారుఖ్ పెళ్లికి హాజరు కాలేకపోయినా.. ముంబైలో జరిగిన అర్పిత సంగీత్ కార్యక్రమానికి హాజరయ్యాడు. రిసెప్షన్ లో అతను అతిథులను పలకరించాడు. కుటుంబ సభ్యుడిలాగే నృత్యం చేశాడు.
ఆ నెల తరువాత జరిగిన ఒక కార్యక్రమంలో షారుఖ్ .. తన కోస్టార్ సల్మాన్ తో ప్యాచ్-అప్ గురించి మాట్లాడారు. ``అహంకారంతో కాదు.. చాలా వినయంతో నేను మాట్లాడుతున్నాను. సల్మాన్ తో నా జీవితంలో చాలా ఆనందకరమైన క్షణాలు ఉన్నాయి. చాలా కొద్ది క్షణాలు మాత్రమే బాధపడ్డాం. కాని నేను భరోసా ఇవ్వగల ఒక విషయం ఏమిటంటే.. జీవితంలో మనం ఒకరికొకరు షేర్ చేసుకునేందుకు ఎల్లప్పుడూ కలిసే ఉంటాం. ఒకరి ఆనందం.. నిరాశ క్షణాలు షేర్ చేసుకుంటూనే ఉన్నాం`` అని తెలిపారు.
“నేను మరియు సల్మాన్ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మా సంబంధం 25 సంవత్సరాల క్రితం ఉన్నట్లేఉంది. మా మధ్య ఎలాంటి చెడు లేదు. బయటి నుండి.. మేము పఠాన్లు .. హాట్ హెడ్ కుర్రాళ్ళు.. కొన్ని సమయాల్లో సమస్యలను కలిగి ఉంటాం. కానీ దానికి మించి ఏమీ లేదు. అర్పిత నాకు కూడా చాలా క్లోజ్. నా కళ్ళ ముందు పెరగడం చూశాను. కాబట్టి ఇక్కడ సారాంశం ఏమిటంటే మా సోదరి వివాహం చేసుకుంటోంది. మేం అక్కడ ఉండాల్సి వచ్చింది” అంటూ షారూక్ సరదాగా నవ్వేశారు మీడియా చాట్ లో. అలా ఖాన్ ల మధ్య శత్రుత్వానికి ఎండ్ కార్డ్ పడిందన్నమాట.