గత రెండు మూడు సంవత్సరాలుగా ఇండియన్ స్క్రీన్ పై పదుల కొద్ది బయోపిక్ లు వచ్చాయి.. ఇంకా పదుల కొద్ది బయోపిక్ లు షూటింగ్ దశలో.. చర్చల దశలో ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. క్రికెట్ రంగానికి చెందిన వారి గురించి.. రాజకీయ ప్రముఖుల గురించి.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించి చివరకు పారిశ్రామిక దిగ్గజాల గురించి కూడా సినిమాలు తీస్తున్నారు. వారందరికి ఏమాత్రం తక్కువ కాని.. ఒక మాట చెప్పాలంటే వారిలో చాలా మంది కంటే చాలా గొప్ప వ్యక్తి.. ఇండియా కీర్తి ప్రతిష్టలు పెంచిన వ్యక్తి ఇండియాను ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన విశ్వనాద్ ఆనంద్ గురించి మాత్రం ఇన్నాళ్లు ఎవరు బయోపిక్ గురించి ఆలోచించలేదు.
గ్లామర్ ఫీల్డ్ లోని వారికే ఇప్పటి వరకు బయోపిక్ ను తీశారు. ఎట్టకేలకు మన అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ సినిమాను కూడా తీసేందుకు రంగం సిద్దం అయ్యింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సిద్దం అవుతున్నాడు. విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈయన ఈ సినిమాను ఒక మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని.. ఒక గొప్ప చాంపియన్ జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ బయోపిక్ కు సంబంధించిన మరింత సమాచారం ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.