బిగ్‌బాస్ 11లో అత్యంత వివాదాస్పద కంటెస్టెంట్ ఎవరంటే... అర్షి ఖాన్ అని చూసిన వాళ్లెవరైనా చెబుతారు. పాపులారిటీ కోసం ఆ రియాల్టీషోలో అర్థనగ్న ప్రదర్శన చేసింది. అసలే బిగ్ బాస్ కుటుంబమంతా చూసే ప్రోగ్రామ్. ఆమె వేసిన డ్రెస్సులపై విమర్శలు రావడంతో... బిగ్ బాస్ ఆమె దగ్గర ఉన్న చిట్టిపొట్టి నైటీలను టాస్క్ పేరుతో తీసేసుకున్నాడు. అప్పట్నించి కాస్త పద్దతైన దుస్తులు వేసుకోవడం ప్రారంభించింది.
ఆ నోరు గురించి ఎంత చెప్పినా తక్కువే... బూతులు ధారాళంగా వస్తాయి. అలాంటి అర్షి ఖాన్... తాను ప్రభాస్ సరసన నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇదెంత వరకు నిజం? అర్షి ఖాన్ గురించి తెలిసిన వారు ఎవరైనా... ప్రభాస్ ఆమెతో నటించడమేంటని అనుకోకుండా ఉండరు. బాహుబలి సినిమాతో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. అలాంటి వ్యక్తి పక్కన పనిచేయడానికి ఎంతో మంది టాప్ హీరోయిన్లు సిద్దంగా ఉన్నారు. కానీ అర్షిఖాన్ కు ఛాన్స్ రావడమేంటీ? ఇదే ఇప్పుడు గందరగోళంగా మారింది. పాపులారిటీ కోసం అర్షిఖాన్ చీప్‌గా ఇలా అబద్ధాలాడుతోందంటూ కామెంట్లు చేసిన వాళ్లు ఉన్నారు. అర్షి ఖాన్ మాత్రం నేను చెప్పేది నిజమే అంటూ సాక్ష్యాలు చూపించింది.
ఆ సాక్ష్యం ఏంటంటే... అర్షిఖాన్ ను తమ సినిమాలో నటించేందుకు ఓ తెలుగు సంస్థ చేసికున్న అగ్రిమెంట్ అది. అగ్రిమెంట్ ఉన్న దాని ప్రకారం సినిమా పేరు రిటర్న్ ఆఫ్ రెబెల్ 3. అగ్రిమెంట్ కు ముందు ఆ ఫిల్మ్ మేకర్స్ ప్రభాస్ హీరో అని చెప్పారని, షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుందని చెబుతోంది అర్షిఖాన్. ఆ అగ్రిమెంట్ ప్రకారం... మెహెర్ రమేష్ దర్శకుడిగా తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో... మెహెర్ నోరు విప్పి చెబితే కానీ తెలియదు.