తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లు అంటూ ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా తమిళ సినీ వర్గాల దృష్టి తో పాటు ప్రేక్షకుల దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. ఈ మూడు సినిమాల్లో కూడా లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ చిత్రంలో అమ్మ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ పోషిస్తోంది. ఇంకా పలువురు స్టార్స్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు విజయ్ ఈ చిత్రాని కి దర్శకత్వం వహించడం వల్ల కూడా ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది.
లైకా ప్రొడక్షన్స్ వారు మొత్తం స్టార్స్ ను ఈ చిత్రం లో దించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజా గా తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బయోపిక్ లో ఎంజీఆర్ పాత్రకు గాను ప్రముఖ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ని ఎంపిక చేసినట్లు గా తెలుస్తోంది. హీరో గా తమిళ మరియు తెలుగు ప్రేక్షకులను అలరించిన అరవింద్ స్వామి ఇప్పుడు చాలా అరుదుగా క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటిస్తున్నాడు.
పాత్ర తన కు బాగా నచ్చితేనే ఆ చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ ధృవ చిత్రంలో అరవింద్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ధృవ ఒరిజినల్ తమిళ వర్షన్ లో కూడా అరవింద్ స్వామి నటించాడు. అమ్మ బయోపిక్ లో అరవింద స్వామి ఉంటే బయోపిక్ స్థాయి పెరగడంతో పాటు తెలుగు రాష్ట్రంలో భారీ క్రేజ్ ను దక్కించుకుంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.