NBK 108 లో అరవింద్ స్వామి.. అంతలోనే ట్విస్ట్‌

Update: 2022-09-08 06:59 GMT
బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో బాలయ్య 108వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న అనిల్ రావిపూడి స్పీడ్ పెంచాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ ముగించినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అనిల్ రావిపూడి ఉన్నాడు.

అందులో భాగంగా దర్శకుడు సినిమా లోని కీలక పాత్రలకు నటీ నటుల ఎంపిక చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అరవింద్ స్వామి ని సంప్రదించారు అంటూ వార్తలు వచ్చాయి. నిజంగానే దర్శకుడు మరియు నిర్మాతలు కలిసి బాలయ్య 108వ సినిమా కోసం అరవింద్‌ స్వామిని సంప్రదించారని.. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్‌ ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బాలయ్య సినిమా లో నటించేందుకు ఆ తమిళ సీనియర్ స్టార్‌ హీరో ఓకే చెప్పాడు. కానీ ఆయన అందుకు పారితోషికంగా భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేశాడట.

ఆ పారితోషికం తాము అనుకున్న బడ్జెట్‌ కి వర్కౌట్‌ అవ్వదని దర్శక నిర్మాతలు భావించి ఆయన్ను ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు లో అరవింద్‌ స్వామికి మంచి క్రేజ్ ఉంది. ఆయన బాలయ్య 108 లో నటిస్తే తప్పకుండా బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన చెప్పిన భారీ పారితోషికం సినిమా కు ఎంత బజ్‌ క్రియేట్‌ అయినా వర్కౌట్‌ అయ్యే పరిస్థితి లేదు అంటూ దర్శకుడు భావిస్తున్నాడట.

ఈ మధ్య కాలంలో తమిళ్‌ లో ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. కనుక భారీగా పారితోషికం ను పెంచేశాడు. అయితే తమిళ్‌ లో తీసుకుంటున్న పారితోషికంకు అధికంగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆయన డిమాండ్ చేయడంతో ఆయన్ను ఎంపిక చేయాలనుకుని అంతలోనే వద్దులే అనుకున్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News