తమిళనాట యాక్షన్ హీరోగా 'ఆర్య'కి మంచి క్రేజ్ ఉంది. ఇక తమిళ అనువాదాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో 'వరుడు' .. 'సైజ్ జీరో' సినిమాలు చేశాడు. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వెళుతున్న ఆయన, మలయాళ సినిమాలను ఎక్కువగా నిర్మిస్తూ వెళ్లడం విశేషం. గతంలో విశాల్ కాంబినేషన్లో ఆయన 'వాడు - వీడు' సినిమా చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఎనిమి' సినిమా రూపొందింది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
నిన్నరాత్రి హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్య మాట్లాడుతూ .. "తెలుగులో నా మాషప్ చూశాను .. చాలా బాగా చేశారు. ఇలాంటివి చూసినప్పుడే నేను ఒక యాక్టర్ ని అనే విషయం నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆనంద్ శంకర్ ఈ కథను చెప్పగానే విశాల్ కి చాలా బాగా నచ్చేసింది. ఈ పాత్రలో 'ఆర్య' చేస్తే బాగుంటుందని సిఫార్స్ చేసింది ఆయనే. సాధారణంగా ఎవరూ కూడా అలా సిఫార్స్ చేయరు .. కానీ విశాల్ చేశాడు. అందుకు కారణం మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ .. నేను ఆ పాత్రను బాగా చేస్తాననే ఆయన నమ్మకం.
ఆనంద్ శంకర్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. 'ఎనిమి' అనగానే అన్ని సినిమాల్లో మాదిరిగా కొట్టుకోవడం మాత్రమే ఉండదు. అంతకు మించి ఫ్రెండ్షిప్ .. లవ్ .. ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫిజికల్ పవర్ ఒకటే కాదు .. మైండ్ పవర్ కూడా చూపించాలని చెప్పే కథ ఇది. అందరికీ కూడా ఈ కథ .. కాన్సెప్ట్ నచ్చుతాయి. ఆనంద్ శంకర్ జాబ్ ఫెంటాస్టిక్ .. ఆయన టేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో అందరికీ మంచి రోల్స్ పడ్డాయి. అందరూ కూడా చాలా అంకితభావంతో అద్భుతంగా చేశారు.
దర్శకుడిగా ఆనంద్ శంకర్ ను మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఆయన తదుపరి సినిమాలకి కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇక ఆర్.డి. రాజశేఖర్ ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసినవాళ్లు .. హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగా అనిపిస్తుందని చెబుతారు. నిర్మాత వినోద్ కుమార్ ఖర్చుకు వెనుకాడలేదు .. బడ్జెట్ పెరిగిపోతున్నా భయపడలేదు. ఇలాంటి ఒక భారీ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.