ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: జైల్లో ఏం చేస్తున్నాడో తెలుసా?

Update: 2021-10-06 13:30 GMT
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అక్టోబర్ 7 వరకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు గోడల మధ్య సైన్స్ పుస్తకాలు చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కోరిక మేరకు ఎస్పీబీ అధికారులు అతడికి సైన్స్ పుస్తకాలు అందించినట్టు సమాచారం.  

ఆర్యన్ ఖాన్ సహా ఇతర నిందితులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్సీబీ నుంచి ప్రతిరోజు భోజనం పెడుతున్నారు. ఇంటి నుంచి వండిన ఆహారాన్ని కార్యాలయ ఆవరణలోకి అనుమతించకపోవడంతో ఎన్సీబీ మెస్ నుంచే ఆర్యన్ కు భోజనం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ , ఇతర నిందితుల ఫోన్ లు ఫోరెన్సిక్ కోసం గాంధీ నగర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన అధికారులు ఆ డేటాను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.రేపటితో ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన నార్కోటిక్స్ అధికారులు కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అనేక సాక్ష్యాలు లభించినట్టు తెలుస్తోంది. అందులో లభించిన మొదటి సాక్ష్యం స్వయంగా ఆర్యన్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండో సాక్ష్యం వాట్సాప్ చాటింగ్.. అతడు వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ కు సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించాడని.. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారని చెబుతున్నారు. ఆర్యన్ ఖాన్ తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారని.. అప్పుడప్పుడూ డ్రగ్స్ పెడ్లర్ ద్వారా కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. డార్క్ వెబ్ వాడినట్టుగా కూడా తెలుస్తోంది.
Tags:    

Similar News