డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కార్డెలియా క్రూయిజ్ షిప్ పై అక్టోబరు 2 అర్థరాత్రి అధికారులు జరిపిన దాడిలో ఆర్యన్ తో సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలతో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (NDPS) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్ కు ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చింది. అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదరని.. ఇతర నిందితులతో కలిసి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. ఆర్యన్ కేసును సీనియర్ లాయర్ సతీష్ మనేషిండే వాదించారు. అయితే బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కేసును కూడా ఆయనే టేకప్ చేశారు.
ఆర్యన్ కేసును రియా కేసుతో పోల్చుతూ సతీష్ మనిషిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు మాదిరిగానే రియా విషయంలోనూ ఇలాంటి విచారణే జరగాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో ఎన్సీబీ విచారణ చేప్పటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని గర్ల్ ప్రెండ్ రియా చక్రవర్తి పై కేసు నమోదు చేశారు. నెల రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత రియా కు బెయిల్ వచ్చింది.
రియా కేసును ఆర్యన్ కేసుతో లింక్ చేస్తూ అడ్వకేట్ సతీష్ మాట్లాడారు. ఇప్పటికే రియా చక్రవర్తి కేసులో ఆర్యన్ ఖాన్ కేసు తరహాలోనే విచారణ జరగాలని తాను సోషల్ మీడియాలో డిమాండ్ చేశానని.. ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఈ కేసును కూడా వేగంగా విచారించాలని అన్నారు.
''ఇలాంటి కేసుల విషయంలో వాట్సాప్ చాటింగ్ లను కోర్టు పరిగణలోకి తీసుకోదని ఎస్ఎన్ ప్రధాన్ - డీజీ - ఎన్సీబీ ఇటీవలే తెలిపారు. రియా చక్రవర్తి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. కాబట్టి ఈ కేసు విషయంలో ఆమె ఎందుకు ఇబ్బంది పడాలి?. ఈ కేసులోనూ ఆర్యన్ ఖాన్ కేసును విచారించిన అధికారుల బృందమే ఉంది. కేసును వేగంగా విచారించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను మరియు పీఎంఓను నేను అభ్యర్థిస్తున్నాను'' అని సతీష్ చెప్పుకొచ్చారు.
''ఆర్యన్ ఖాన్ కేసును పూర్తిగా విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేసి నిజాలను వెలికితీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. రియా చక్రవర్తి కేసు విషయంలోనూ వారు అదేవిధంగా వ్యవహరించాలి. నిజానికి ఇలాంటి కేసులన్నింటినీ ఇదే విధంగా విచారణ చేయాలని కోరుకుంటున్నా. దీపికా పదుకొనే - రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీ ఖాన్ కూడా ఎన్సీబీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. ఎన్సీబీ ఈ విషయంపై కూడా దర్యాప్తుని వేగవంతం చేయాలి'' అని సీనియర్ లాయర్ పేర్కొన్నారు.