జైలు నుంచి స్టార్ హోటల్ కు ఆర్యన్ ఖాన్ కారణమిదే

Update: 2021-10-30 13:36 GMT
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దాదాపు 4 వారాల తర్వాత ఈరోజు ముంబై జైలు నుంచి విడుదలయ్యాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ శనివారం ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో గురువారమే ఆర్యన్ కు బెయిల్ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు బయటకు వచ్చాడు.

ఇక తన కుమారుడు ఆర్యన్ ను జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు స్వయంగా తండ్రి షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీఖాన్ ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 28 రోజుల తర్వాత తిరిగి ఆర్యన్ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.

శనివారం ఉదయం 11 గంటలకు ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్డు జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు. 27 రోజుల తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.

షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను తీసుకెళ్లడానికి షారుఖ్ బాడీగార్డు రవి ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్ తెల్లటి రేంజ్ రోవర్ లో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆర్యన్ ను తీసుకెళ్లడానికి మూడు కార్ల కాన్వాయ్ ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ కు ఆర్యన్ ఖాన్ తో వెళ్లింది. ఆర్యన్ ఖాన్ కోసం తండ్రితోపాటు లాయర్ల టీం అదే ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. అదే హోటల్ కు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం చేరుకున్నారు.

ఆర్యన్ ఖాన్ కోసం తండ్రి షారుఖ్ ఖాన్ తోపాటు లాయర్ల టీం అదే ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేశారు. అదే హోటల్ కు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం చేరుకోనున్నారు.

ఇక ముంబై పోలీసులు ఆర్యన్ ఖాన్ కు ఎస్కార్ట్ ఇచ్చాయి. షారుఖ్ ఖాన్ అభిమానులను , మీడియాను ఆర్యన్ ఖాన్ మన్నత్ కు చేరుకునే రోడ్లను క్లియర్ చేయాలని.. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు
Tags:    

Similar News