రామ్ చరణ్ సినిమాకు టాటా చెప్పేశాడు

Update: 2016-05-25 09:38 GMT
‘బ్రూస్ లీ’ తర్వాత రామ్ చరణ్ చేయాలనుకున్నది రీమేక్ సినిమా. ఇది కన్ఫమ్ అయి దాదాపు పది నెలలు అవుతోంది. స్క్రిప్టులో పెద్దగా మార్పులు కూడా చేయలేదంటున్నారు. మరి ఇప్పటిదాకా ఈ సినిమా షూటింగ్ పావు శాతమైనా పూర్తి కాలేదు. సినిమా ప్రారంభోత్సవం జరిగి కూడా కొన్ని నెలలవుతున్నా.. చిన్నా చితకా సన్నివేశాలు తప్ప పెద్దగా షూటింగ్ జరిగింది లేదట. ఏ షెడ్యూల్ కూడా అనుకున్న ప్రకారం సాగకపోవడం.. ఇంకా హీరో అసలు రంగంలోకే దిగకపోవడంతో ఈ సినిమా నుంచి కెమెరామన్ అజీమ్ మిశ్రా తప్పుకున్నట్లు సమాచారం. సినిమా చాలా రిచ్ గా ఉండాలన్న ఉద్దేశంతో బాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన అజీమ్ ను తీసుకొచ్చారు.

ఐతే షూటింగ్ అనుకున్న ప్రకారం సాగకపోవడంతో వేరే కమిట్మెంట్లను దృష్టిలో పెట్టుకుని చరణ్ సినిమాకు టాటా చెప్పేశాడట అజీమ్. దీంతో మనం.. ఊపిరి లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన పీఎస్ వినోద్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అజీమ్ తీసిన సన్నివేశాల్ని మళ్లీ రీషూట్ చేస్తారా.. వాటితోనే కంటిన్యూ అయిపోతారా అన్నది చూడాలి. అజీమ్ అసలే కాస్ట్లీ సినిమాటోగ్రాఫర్. చరణ్ సినిమా వల్ల అతడి కాల్ షీట్లు చాలా వృథా అయ్యాయి. కాబట్టి నిర్మాత అల్లు అరవింద్ కు బాగానే బ్యాండ్ పడి ఉంటుంది. ఆ సంగతలా వదిలేస్తే.. పీఎస్ వినోద్ కు తెలుగులో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ కావడం విశేషం. ‘పంజా’ సినిమాతో అతను టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఆ సినిమా ఫ్లాపైనా వినోద్ కు మంచి పేరొచ్చింది.
Tags:    

Similar News