సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన మూడో తరం వారసుడు అశోక్ గల్లా. నటశేఖర కృష్ణ మనవడిగా.. మహేష్ బాబు మేనల్లుడుగా.. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడుగా ''హీరో'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అశోక్.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో లవ్ - యాక్షన్ - కామెడీ - రొమాన్స్ కలబోతగా తెరకెక్కిన ''హీరో'' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను వీక్షించిన కృష్ణ మరియు మహేష్ బాబు ఇద్దరూ అశోక్ గల్లా పెరఫార్మెన్స్ ను మెచ్చుకున్నారు.
సాధారణ ఆడియన్స్ సైతం అశోక్ గల్లా చాలా పర్ఫెక్షన్ తో ఈజ్ తో నటించాడని.. డెబ్యూ యాక్టర్ గా కనిపించలేదని అభిప్రాయపడుతున్నారు. అలానే అశోక్ కామిక్ టైమింగ్ - స్టైలిష్ డ్యాన్స్ లు మరియు యాక్షన్ సన్నివేశాల్లో ప్రశంసలు అందుకుంటున్నాడు.
సినిమాల్లోకి రావడానికి ముందే బాగా గ్రౌండ్ వర్క్ చేసిన అశోక్.. తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోడానికి అవకాశం కల్పించిన 'హీరో' సినిమాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడని చెప్పాలి. రాబోయే రోజుల్లో మంచి కథలు ఎంచుకుని.. ఎక్స్‌ప్రెషన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ''హీరో'' చిత్రాన్ని కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మించారు. చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. సమీర్ రెడ్డి - రిచర్డ్ ప్రసాద్ ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.