ఫోటో స్టోరీ : టెర్రస్ మీద ఆరేస్తున్న అందాలు..!

Update: 2022-10-29 02:30 GMT
ఐదు సీజన్లు.. ఒక ఓటీటీ సీజన్ మొత్తం ఆరు సీజన్లలో బిగ్ బాస్ వల్ల బాగా లాభపడ్డ వారిలో ముందుగా చెప్పుకునే పేరు అషు రెడ్డి. అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ తో జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న అమ్మడిని బిగ్ బాస్ సీజన్ 3లో సెలెక్ట్ చేశారు. ఆ సీజన్ లో యూత్ ఆడియన్స్ ని అలరించిన అందాల భామల్లో అషు రెడ్డి ఒకరు. సీజన్ లో అషు ఆట మీద కన్నా అందాల మీదే ఎక్కువ ఫోకస్ చేశారు ఆడియన్స్.

ఇక బిగ్ బాస్ తర్వాత తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది అషు రెడ్డి. అంతేనా బిగ్ బాస్ ఓటీటీ లో కూడా అషు రెడ్డి మరోసారి ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ కి ఒక్కసారి ఛాన్స్ రావడమే ఎక్కువ అనుకుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మరోసారి అలరించింది అషు రెడ్డి.

బిగ్ బాస్ వల్ల సోషల్ మీడియాలో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న అషు రెడ్డి తన ఫోటో షూట్ తో దాన్ని డబుల్ చేసుకుంటుంది. కంప్లీట్ బోల్డ్ లుక్ తో ఏమాత్రం మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన చేస్తుంది అషు రెడ్డి.

రీసెంట్ గా ఏకంగా బ్రాతో ఉన్న ఫోటోలని కూడా షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కించేసింది అమ్మడు. ఓ ఐదారు సినిమాలు చేసిన హీరోయిన్ కి కూడా రానంటువంటి క్రేజ్ అషు రెడ్డి ఈ హాట్ షో వల్ల సంపాదించేసింది. ఇక లేటెస్ట్ గా అషు రెడ్డి టెర్రస్ మీద అందాలను ఆరేసింది. టీ షర్ట్ జీన్స్ షార్ట్ తో థైస్ షో చేస్తూ టెర్రస్ మీద బట్టలు ఆరేస్తూ కూడా ఫోటో షూట్ చేసింది అమ్మడు. ఒక పాపులారిటీ వచ్చాక ఏం చేసినా సరే అది వైరల్ అవుతుంది అన్నట్టుగా.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూసుకుని రెచ్చిపోతుంది అషు రెడ్డి.

ఇంత అందగత్తెకి సినిమా అవకాశాలు ఎందుకు రావట్లేదు అన్న డౌట్ రాక మానదు. అషు రెడ్డికి ఇప్పటికే చాలా సినిమా అవకాశాలు వచ్చాయట. అయితే సినిమాల కన్నా తనకు ఈ సోషల్ మీడియా క్రేజ్ తోనే సంతృప్తి ఉందని చెబుతుందట. అంతేకాదు మనసుని కదిలించే కథ దొరికితే మాత్రం తప్పకుండా చేస్తానని అంటుందట.

అషు చేస్తున్న ఫోటో షూట్స్ చూస్తే ఆమెని గ్లామర్ హీరోయిన్ గానే చూపించాలని.. అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతారు. కానీ అషు మాత్రం ఫీల్ గుడ్ మూవీస్ చేయాలని అనుకుంటుందట. మరి అలాంటి ఛాన్స్ వచ్చే దాకా అషు రెడ్డి అందాల సునామీ కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News