ద‌త్ గారికి మ‌న‌వ‌డు పుట్టాడు!

Update: 2016-11-07 15:09 GMT
ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీద‌త్ కి తాత‌య్య‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ఆయ‌న‌తో స‌ర‌దాగా ఆడుకునేందుకు ఒక బుడ‌తడు వ‌చ్చాడు! తెలుగులో దిగ్గ‌జ నిర్మాత ఆయ‌న‌. చిరంజీవి వంటి టాప్ స్టార్ ల‌తో భారీ చిత్రాలు నిర్మించాలంటే ఆయ‌నకే చెల్లింది. భారీ త‌నానికీ పెట్టింది పేరు... వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌. ఒక‌ప్పుడు ఆ సంస్థ‌లో పనిచేయాల‌ని హీరోలూ ద‌ర్శ‌కులూ టెక్నీషియ‌న్లు క‌ల‌లు క‌నేవారు. తెలుగు ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల‌ను నిర్మించారు అశ్వినీద‌త్‌. అయితే, ఈ మ‌ధ్య కాస్త విరామం తీసుకున్నారు. నిర్మాణ బాధ్య‌త‌లు త‌న కుమార్తెలు చూసుకుంటున్నారు. అశ్వినీద‌త్ కు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె ప్రియాంకా ద‌త్ కి ఈరోజు (సోమ‌వారం) ఒక మ‌గ‌బిడ్డకు జన్మనిచ్చారు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో ప్రియాంకా వివాహం గ‌త ఏడాది జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

నాగ్ అశ్విన్ ది హైద‌రాబాదే! ఇక్క‌డే ఒక ప్ర‌ముఖ వైద్యుల కుటుంబానికి చెందిన కుర్రాడు. నానీ హీరో న‌టించిన ‘ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం’ సినిమాకి ద‌ర్శ‌కుడు కూడా అత‌డే. ఈ సినిమాకు నిర్మాణ బాధ్య‌త‌లు ప్రియాంకా చూసుకుంది. ఈ సంద‌ర్భంగానే ఇద్ద‌రి మ‌ధ్యా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అభిరుచులూ అల‌వాట్లూ ఒక‌టి కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం పెరిగింది. ఆ స్నేహం సినిమా పూర్త‌య్యే లోపు ప్రేమ‌గా మారింది. ఈ ఇద్ద‌రి ప్రేమ‌నూ రెండు కుటుంబాలు అంగీక‌రించ‌డంతో గ‌త ఏడాది వీరి వివాహం జ‌రిగింది. తాత‌య్య అయ్యార‌నే వార్త తెలియ‌గానే అశ్వినీద‌త్ ఆనందంతో ఉన్నారు. ప‌లువురు సినీరంగ ప్ర‌ముఖులు ఆయ‌న్ని ప‌ల‌క‌రించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా... గత నాలుగు రోజుల క్రితం మరో నిర్మాత దిల్ రాజు తాత అయినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News