సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియో విషయంలో మొదట్లో కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఫైనల్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి మళ్ళీ పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలు అందరూ కలిసికట్టుగా కనిపించడంతో 'మహర్షి' చుట్టూ నెలకొన్న నెగెటివిటీ దూరమైంది.
అయితే ఇక్కడ చాలామంది మనసులో ఉన్న అనుమానం ఏంటంటే అశ్విని దత్.. దిల్ రాజుల మధ్య నెలకొన్న వివాదం ఎలా పరిష్కారం అయింది? ఎలా వారి మధ్య సయోధ్య కుదిరింది? ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఇన్వాల్వ్ అయి పరిష్కరించాడట. అశ్విని దత్ ఈ సినిమా నుండి తనకు 10 కోట్ల రూపాయలు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మరో నిర్మాత దిల్ రాజు మాత్రం సినిమా కు భారీగా బిజినెస్ జరిగినా ఒక్క రూపాయ కూడా మిగలలేదని.. సినిమాపై పెట్టిన ఖర్చుకు అది సరిపోయిందని అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ ముంగిట ఈ వివాదం చేటు చేస్తుందని గ్రహించిన మహేష్ బాబు దిల్ రాజును కన్విన్స్ చేసి రూ. 7 కోట్లు అశ్విని దత్ కు ఇచ్చేలా సెటిల్ మెంట్ చేశాడట.
'మహర్షి' నుంచి అశ్విని దత్ భాగం ఇక ఆ ఏడు కోట్లు అన్నట్టే. ఇకపై సినిమాలో అయనకు ఎలాంటి వాటా ఉండదన్నమాట. ఈ ఎపిసోడ్ లో అశ్వినిదత్ పై మహేష్ బాబు కాస్త కినుక వహించారని అంటున్నారు. ఒకవేళ సినిమా కనుక సూపర్ హట్ అయి భారీ లాభాలు వచ్చినా అవి దిల్ రాజు - పీవీపీ లు మాత్రమే షేర్ చేసుకుంటారు. అందుకే వివాదం సంగతి పక్కన పెట్టేసి 'మహర్షి' టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేస్తున్నారట. సమ్మర్ సీజన్.. పైగా ఇతర సినిమాలు ఏవీ లేవు. మంచి టాక్ వస్తే మహేష్ బాబు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయం.