నాలుగైదు భాషల్లో టాపీ హీరోయిన్ గా వెలిగిన ఓ అందాల నటి, ఓ కోటీశ్వరుడైన పారిశ్రామిక వేత్తల పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ ఆశిన్ - మల్టీ మిలియనీర్ రాహుల్ శర్మల వివాహం అంతకంటే వైభవంగానే జరిగింది. ఉదయాన్నే చర్చ్ లో వీరి పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరగగా.. ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నారు.
రాహుల్ - ఆశిన్ లను ఒకటి చేయడానికి, ఏడు అడుగులు వేయించడానికి ఏడుగురు పూజారులు తంతు నిర్వహించారంటేనే.. ఈ మ్యారేజ్ ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఉదయం చర్చ్ లో జరిగిన పెళ్లికి 100కి పైగా గెస్టులు హాజరు కాగా, హిందూ వివాహ వేడుకకు 150 నుంచి 200 మంది హాజరయ్యారు. సాధారణంగా బడా పర్సనాలిటీల పెళ్లి అంటే ఉండే భారీ హంగామా లేకుండానే.. వీలైనంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. గానా బజానా లాంటి కార్యక్రమాలను కూడా పెద్దగా నిర్వహించకుండా ఓ రకంగా ఆదర్శంగా నిలిచారనే చెప్పాలి.
సాధారణంగా ఢిల్లీలో జరిగే పెళ్లిళ్లలో నాచ్ గానాల తంతు ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరు మాత్రం వాటికి దూరంగానే ఉన్నారు. అయితే అక్షయ్ కుమార్ మాత్రం ఉదయం చర్చ్ లో పెళ్లితో పాటు - రాత్రికి డిన్నర్ కి కూడా హాజరయ్యాడు. వచ్చిన ఆహుతులు అందరికీ దగ్గరుండి వడ్డించి, అవసరాలు చూస్తూ.. ఆశిన్ - రాహుల్ లు వారిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఏడు అడుగులకి ఏడుగురు పూజారుల కాన్సెప్ట్ మాత్రం చాలామందికి నచ్చింది. బహుశా, ఇకనుంచి ఇదో ట్రెండ్ అయిపోయినా ఆశ్చర్యం లేదు.