రెండేళ్ల పాటు ఎఫైర్‌ ని దాచిపెట్టింది

Update: 2015-08-10 15:38 GMT
సౌత్‌ నుంచి నార్త్‌ వెళ్లి సత్తా చాటింది అశిన్‌. వరుసగా 100కోట్ల క్లబ్‌ సినిమాల్లో నటించిన దక్షిణాది నాయికగా పేరు తెచ్చుకుంది. అయితే ఏం లాభం? ఆ క్రేజును కలకాలం కొనసాగించడంలో ఫెయిలైంది. ఫలితం ఇప్పుడు కెరీర్‌ ఖాళీ అయిపోయే పరిస్థితి. అందుకే ఇక సంసారంలో సెటిలవుతోందని వార్తలొచ్చాయి. మైక్రోమాక్స్‌ కంపెనీ ఓనర్‌ రాహుల్‌ ని పెళ్లాడేందుకు రెడీ అవుతోందంటూ ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే ఉన్నట్టుండి సైలెంట్‌ గా ఈ వార్త బైటికొచ్చింది. నిన్నటివరకూ తెలియనిది ఇలా లీకై ఇండస్ట్రీ లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

వాస్తవానికి అశిన్‌ రెండేళ్ల నుంచే రాహుల్‌ శర్మ తో ఎఫైర్‌ నడిపిస్తున్నా ఎక్కడా బాలీవుడ్‌ మీడియా కంట పడకుండా మ్యానేజ్‌ చేసేసింది. ప్రేమలో ఉన్న విషయం ఎప్పుడూ లీక్‌ చేయకుండా జాగ్రత్త పడింది. సంగీత బిజిలానీ అజార్‌ ని ప్రేమించినా, నగ్మా గంగూలీ ని ప్రేమించినా, అనుష్క శర్మ విరాట్‌ కోహ్లీ తో చెట్టాపట్టాల్‌ వేసుకు తిరిగినా బైట పడకుండా దాచిపెట్టలేకపోయారు.

వీళ్లందరితో పోలిస్తే అసిన్‌ చాలా తెలివైనదే. కెరీర్‌ విషయంలో తెలివితేటలు చూపించకపోయినా ఎఫైర్‌ విషయంలో  మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేసిందని ఇప్పుడు అంతా సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News