దేవరకొండ సినిమాలో ఛాన్స్ కోసం డర్టీ ఆఫర్ ఇచ్చారట!

Update: 2019-06-04 12:06 GMT
గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఉద్యమం #మీటూ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉద్యమంతో బైటకు వచ్చిన మహిళలు చేసిన ఆరోపణలలో ఏవి నిజమైనవి.. ఎంతమంది నిందితులు నేరస్తులుగా నిరూపింపబడ్డారు అనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలే. ఇదిలా ఉంటే తాజాగా ఒక తమిళ నటి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ సందర్భంగా సంచలనాత్మక విషయం వెల్లడించింది.

షాలు శాము అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఈమధ్యే విడుదలైన శివకార్తికేయన్ తాజా చిత్రం 'Mr. లోకల్' సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా షాలు శాము అభిమానులతో చాట్ చేసింది.  ఒక నెటిజనుడు షాలును "మీకు ఫిలిం ఇండస్ట్రీ లో #మీటూ అనుభవం ఉందా?" అని అడిగారు. దీనికి సమాధానంగా అవునని ఒప్పుకుంది.  "ఒకవేళ నేను ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఏముంటుంది? నిందితులు ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారని అనుకుంటున్నారా?" అని ప్రశ్నించింది.  "ఈమధ్య ఒక ఫేమస్ డైరెక్టర్ తనతో ఒక రాత్రి గడిపితే విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అన్నాడు" అని చెప్పింది.

అయితే షాలు మాత్రం ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ పేరు ఉండడంతో షాలు కామెంట్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి.  దీంతో ఆ దర్శకుడు ఎవరు.. ఏ సినిమా కోసం అలాంటి డర్టీ ఆఫర్ ఇచ్చారు అనేదానికి చర్చలు.. ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి..

    

Tags:    

Similar News