'అసుర'పై అంచనాలు పెంచేసుకోండి!

Update: 2015-05-25 04:42 GMT
 సైలెంట్‌గా సినిమాలు పూర్తి చేస్తుంటాడు నారా రోహిత్‌. ఇటీవల కృష్ణ విజయ్‌ అనే ఓ కొత్త దర్శకుడితో 'అసుర' సినిమా చేశారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు పూర్తయిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇటీవల ఏకంగా టీజర్‌తో ఇంటర్నెట్‌లో సందడి చేశారు. మరోసారి నారా రోహిత్‌ పోలీసు పాత్రలో కనిపించారు. పవర్‌ఫుల్‌ డైలాగులతో కూడిన ఆ టీజర్‌ని చూస్తే ఓ మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారని అర్థమవుతోంది. అయితే అందులోకి థ్రిల్లర్‌ అంశాల్ని కూడా జోడించారట. అది సినిమాని మరింత ఇంట్రస్టింగ్‌ మార్చేసిందని సమాచారం.

   ప్రియా బెనర్జీతో కలిసి నారా రోహిత్‌ నటించిన 'అసుర'కి నిన్ననే సెన్సార్‌ చేశారు. సరిగ్గా రెండు గంటల నిడివితో కూడిన ఆ చిత్రానికి సెన్సార్‌ బృందం యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సెన్సార్‌ గది నుంచి మంచి పాజిటివ్‌ రిపోర్ట్‌ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి సందడి లేకుండా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాపై ఎన్నైనా అంచనాలు పెంచుకోవచ్చని చిత్రబృందం చెబుతోంది. సెన్సార్‌పూర్తయింది కాబట్టి సినిమాని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News