విలక్షణ కథాచిత్రాల కథానాయకుడు ధనుష్ నటించిన తాజా చిత్రం `అసురన్`. వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ జాతీయ అవార్డు కాంబో మూవీపై రిలీజ్ ముందే అంచనాలేర్పడ్డాయి. ట్రైలర్ కూడా డిఫరెంట్ యాక్షన్ తో ఆకట్టుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ శుక్రవారం అసురన్ విడుదలైంది. దీనిపై టాక్ ఏంటట? అని ఆరా తీస్తే ఆసక్తికర సంగతులు తెలిశాయి.
ఇదో వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. వెక్కై అనే ఓ ఫేమస్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల ప్రయోగాలతో ముందుకెళుతున్న ధనుష్ ఈ చిత్రంలో అసురుడు అనిపించే శివస్వామి పాత్రలో నటించాడు. ముఖ్యంగా గెటప్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి తొలి షో నుంచే ట్రెమండస్ రెస్పాన్స్ మొదలైనట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమా చూసిన చాలా మంది నెటిజనులు సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా వస్తుందని.. ధనుష్ నటన అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. ధనుష్ నటనకు జాతీయ అవార్డు దక్కపోతే అవార్డుకే అర్థం వుండదని.. ఖచ్చితంగా అవార్డుని సొంతం చేసుకునే సినిమా ఇదని ట్విట్టర్ వేదిక పోస్ట్ లు పెడుతున్నారు. `సైరా` వంటి బిగ్గెస్ట్ మూవీ తరువాత రిలీజైన సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. మలయాళ నటి మంజు వారియర్ కథానాయికగా తమిళ తెరకు పరిచయమైంది.
ఇక అసురన్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే రథన్ బీజీఎమ్స్ అదుర్స్ అని సంగీతం పరంగానూ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలో ధనుష్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రల్లోనూ అదరగొట్టేశాడట. మరి కొంత మందేమో ఇంటర్వెల్ బ్యాంగ్ రొమాంచితంగా వుందని సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు. అంటే అసురన్ తో ధనుష్ కు నేషనల్ అవార్డ్ గ్యారంటీ అన్న టాక్ విస్త్రతంగానే స్ప్రెడ్ అవుతోంది. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు ఖాయమన్నారు. కానీ రాలేదు. మరి ధనుష్ పరిస్థితేంటో చూడాలి.