అల్లుడంటే ఉండే గౌరవమే వేరు! దేశ వ్యాప్తంగా ఏమోగానీ తెలుగు లోగిలిమాత్రం అల్లుడికి ఇచ్చే గౌరవం - మర్యాద అంతా ఇంతా కాదు! అల్లుడు కష్టపడుతుంటే కూతురిని ఇచ్చిన మామ అస్సలు ఊరుకోలేడు. అలుపెరగకుండా అల్లుడు సుఖపడాలని ఏ మామైనా కోరుకుంటాడు. అది లోక్లాస్ మామైనా.. హైక్లాస్ మామైనా.. ఎందుకంటే.. అల్లుడు అల్లుడేగా మరి!! ఇప్పుడు ఈ సూత్రం మెగా నిర్మాత అశ్వనీ దత్ విషయంలోనూ వర్తిస్తోంది.
ఆయన అల్లుడు - ఎవడే సుబ్రమణ్యం దర్మకుడు నాగ్ అశ్విన్.. తాజాగా తెలుగువారి ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ ‘సావిత్రి’ జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు. మొదట్లో నాగ్ ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే తీయాలనుకున్నాడు. అయితే, తెలుగింటి అల్లుడు అందునా మెగా నిర్మాత అల్లుడు ఓ చిత్రాన్ని నిర్మస్తుంటే సదరు నిర్మాత ఊరుకుంటాడా? ఆయనకు నిద్ర పడుతుందా? అశ్వనీ దత్ కూడా ఇదే చేశాడు. ఈ సినిమాను కేవలం ప్రాంతీయ భాషకే పరిమితం చేయకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు.
అల్లుడు గారి సినిమాలోకి అశ్వనీదత్ ఎంటరయ్యాడు. ఈ సినిమాను తనదైన స్టయిల్లో తీసేందుకు పక్కాగా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో అల్లుడు నాగ్ తీస్తున్న అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ - హిందీ భాషల్లో లావిష్ గా నిర్మించాలని ఆయన డిసైడ్ అయ్యారు. దీనికి తగ్గట్టుగానే, సావిత్రి పాత్ర కోసం ఆయన దీపికా పదుకోన్ - ప్రియాంక చోప్రా - కరీనా కపూర్ - విద్యాబాలన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ట్రై చేస్తున్నారట. మొత్తానికి అల్లుడి కోసం అశ్వనీదత్ బాగానే కష్టపడుతున్నారని ఫిలింనగర్ వర్గాలు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నాయి.