ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.. దత్ ను బాధించింది

Update: 2017-01-08 04:48 GMT
సమాజం.. అభివృద్ధి.. మార్పు.. గ్లోబలైజేషన్.. ఇలాంటి పదాలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయ్ కానీ.. సొంత జీవితంలో అవి అనుభవంలోకి వచ్చేసరికి భరించలేనంత బాధ ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను వేరే కులం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేయడంలో ఇప్పటికీ ఎన్నెన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. తన ఇద్దరు కూతుళ్ల కులాంతర వివాహాలపై తాను ఎలా ఫీల్ అయ్యాడో చెప్పి.. ఆశ్చర్యపరిచారు బడా నిర్మాత అశ్వినీ దత్.

తన పెద్ద కూతురైన ప్రియాంక వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఈయనను బోలెడంత ఆవేదనకు గురి చేసిందట. చాలా రోజుల పాటు బాధ పడుతూనే ఉండేవాడట. అసలు కొన్ని రోజుల పాటు ఇంట్లోంచి బయటకు కూడా రాలేకపోయానని అన్నారు అశ్వినీదత్. కులాంతర వివాహం తనను అంతగా కుంగదీసిందంటూ ఓపెన్ అయిపోయాడీ నిర్మాత. అయితే.. ఈయన రెండో కూతురు స్వప్న కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ను వివాహం చేసుకుంటానని చెప్పిన సమయానికి.. తనలో మార్పు వచ్చిందని అన్నారు అశ్వినీదత్.

ఇలాంటి తనకు అలవాటు అయిపోయాయన్న ఆయన.. ఇప్పుడు మూడో కూతురు ఎవరిని పెళ్లి చేసుకున్నా.. తాను అభ్యంతరాలు చెప్పబోనని అన్నారు. సినిమాల విషయంలో మాత్రం కూతుళ్లు మంచి సినిమాలు తీస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు అశ్వినీదత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News