ట్రైలర్ టాక్: సింపేసిన శ్రీమన్నారాయణ

Update: 2019-11-28 12:28 GMT
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ'.  ఈ చిత్రానికి రక్షిత్ శెట్టి & ది సెవెన్ ఆడ్స్ కథ అందించగా సచిన్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాను ఐదు భాషలలో విడుదల చేస్తున్నారు.  కౌబాయ్ జోనర్లో ట్రెజర్ హంట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.  తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయింది.  నాలుగు నిముషాలు ఉన్నట్రైలర్ లో ఏం దాచిపెట్టకుండా స్టొరీని వివరించారు. ట్రైలర్ నిడివిలో ఇదో రికార్డు కూడా అయి ఉండొచ్చు!

దక్షిణాదిలో ఒక ఊహాజనిత పట్టణం. అక్కడ ఊరినిండా బందిపోటులే. అక్కడ ఒక పోలీసు ఆఫీసర్.  అతడే హీరో. ట్రైలర్ ఆరంభంలో ఒక బార్ కు బయట 'పోలీస్ నాట్ ఎలవ్డ్" అనే బోర్డు  ఉంటుంది. హీరో స్టైల్ గా సిగార్ వెలిగించుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. "బోర్డ్ చూడలేదా" అంటూ హీరోను ఒకడు దబాయిస్తాడు. అంతే.. ఆ 'NOT' రాసి ఉండే చెక్కను రజనీ స్టైల్ లో కాలితో తట్టి.. కింద పడుతుంటే చేత్తో క్యాచ్ చేస్తాడు. 'నాట్' కిందపడింది కాబట్టి అది 'పోలీసులకు ప్రవేశం' అయిపోతుంది కదా. అప్పుడు స్టైల్ గా లోపల అడుగుపెడతాడు.  లోపల టేబుల్ పైన రిజర్వ్డ్ అని రాసి ఉంటుంది. అక్కడకు ఈ నాట్ చెక్కను తీసుకెళ్లి పెడతాడు.  అది నాట్ రిజర్వుడు అయిపోతుంది.. వెంటనే అక్కడ కూచుంటాడు.  ఇలా మొదటి సీన్ తోనే సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఒక పవర్ ఫుల్ వ్యక్తి పేరు జయరాముడు. అతని నిధిని ఎవరో దొంగిలిస్తారు.  దీంతో ఆ నిధిని వెనక్కు తెచ్చుకోవాలి.. ఆ దొంగను.. అతని కుటుంబాన్ని అంతం చేయాలి అని అతను ప్రతిజ్ఞ చేస్తాడు. అడ్డు వచ్చినవారిని చంపేస్తూ ఉంటాడు.  ఈ వ్యక్తికి హీరో సహాయం చేస్తాని ఒప్పందం కుదుర్చుకుంటాడు.  ఇటు జయరాముడికి ఆ దొంగకు మధ్య హీరో ఏం చేస్తాడు.  అసలు ఆ నిధి విషయంలో హీరో ఎందుకు వేలు పెట్టాడు అనేది సినిమా కథ.

ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ ట్రైలర్స్ లో ఇదొకటి.  నాలుగు నిముషాలు చూసినా మరోసారి చూడాలనిపిస్తుంది.  రక్షిత్ స్టైల్.. సినిమాలోని హీరోపాత్రకు భలే సెట్ అయ్యాయి. ఇక ఆర్ట్ వర్క్.. నిజంగా కౌబాయ్ సినిమాను తలపించింది.  స్టంట్స్ బాగున్నాయి.. సినిమాటోగ్రఫీ బాగుంది.  అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన అంశం ఇది.  ఒక్క ముక్కలో చెప్తే 'అతడే శ్రీమన్నారాయణ' లో విషయం ఉంది. ఆలస్యం ఎందుకు.. వెంటనే రష్మిక పాత బాయ్ ఫ్రెండ్ విశ్వరూపం చూసేయండి.


Full View
Tags:    

Similar News