తండ్రి తొలి రిలీజ్‌ రోజే కూతురి రిలీజ్‌

Update: 2015-08-24 14:07 GMT
సోనాక్షి, సోనమ్‌, ఆలియా సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చి వెండితెరపై పాపులర్‌ అయ్యారు. కథానాయికలుగా కెరీర్‌ ని సాగిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో నటవారసురాలు ఎంట్రీ ఇస్తోంది.

బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కూతురు ఆథియా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తోంది. ఆరంగేట్రం హీరో చిత్రంలో సూరజ్‌ పాంచోళీ సరసన నాయికగా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ ఆథియాకి, సునీల్‌ కి ఇద్దరికీ ఓ సర్‌ ప్రైజ్‌ ట్రీట్‌. అనుకోకుండానే అయినా తండ్రీ కూతుళ్లను ఎంతో ఎగ్జయిట్‌ కి గురి చేస్తోంది. సునీల్‌ శెట్టి 23ఏళ్ల క్రితం అంటే 1992లో హీరోగా ఆరంగేట్రం చేశాడు. అతడు నటించిన బల్వాన్‌ సెప్టెంబర్‌ 11న రిలీజైంది. సరిగ్గా అదే రిలీజ్‌ రోజు కూతురు ఆథియా నటించిన 'హీరో' చిత్రం రిలీజవుతోంది. దర్శకుడు నిఖిల్‌ అద్వానీ రిలీజ్‌ విషయం చెప్పి సర్‌ ప్రైజ్‌ చేశాడు. ఎంతో ఎగ్జయిటింగ్‌ మూవ్‌ మెంట్‌ అంటూ సునీల్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఓ తండ్రిగా గర్వంగా ఉంది. ఎదిగొచ్చిన కూతురిని  చూసుకుంటున్నా. నటిగా పెద్ద స్థాయికి వెళుతుందన్న నమ్మకం ఉంది. సూరజ్‌, ఆథియా నటన పరంగా మెరుపులు మెరిపిస్తారు ఈ చిత్రంతో అంటూ నమ్మకంగా చెప్పాడు సునీల్‌ శెట్టి. ఆల్‌ ది బెస్ట్‌ టు ఆథియా.
Tags:    

Similar News