బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి డాటర్ ఆతియా శెట్టి కథానాయిక అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య పాంచోళి తనయుడు సూరజ్ పాంచోళి సరసన 'హీరో' రీమేక్‌లో నటించింది. సల్మాన్‌ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించి ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత సౌత్‌లో నటించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు అమ్మడు సూటిగా నో చెప్పేసింది.
అసలు నాకు ఆ ఆలోచనే లేదని చెప్పింది. ప్రస్తుతం హీరో రిలీజ్‌పైనే దృష్టి సారించాను. అసలు ఆ సినిమాలో నా నటనకు ఎన్ని మార్కులు వేస్తారో అన్న టెన్షన్‌లో ఉన్నా. నాన్న(సునీల్‌శెట్టి) నాకు నటన విషయంలో ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. నాకు తోచినట్టే నటించాను. దీనికోసం భాష సహా నటన ఇతర విషయాలపై బాగా కసరత్తులు చేశాను. ప్రస్తుతానికి నా మాతృభాషలోనే నటిగా ఎదగాలనుకుంటున్నా.. అని చెప్పింది.
సౌత్ నుంచి ఆఫర్లు వచ్చినా ప్రస్తుతానికి అంగీకరించే అవకాశమే లేదని అంది. హీరోలో అత్యుత్తమంగా నటించడానికి ప్రయత్నించా. సల్మాన్‌కి, నాన్నకి పేరు తెస్తానన్న నమ్మకం ఉందని ఆశాభావాన్ని ఆతియా వ్యక్తం చేసింది. మొదటి సినిమా కాబట్టి టెన్షన్‌లో ఉంది ఈ భామ. తెలుగులో నటించమని ఒత్తిడి చేయడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి మన దర్శకనిర్మాతలు కాసింత ఓపిగ్గా వేచి చూడాల్సిందే.