ఇటీవల జమ్ము కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై దేశ ప్రజలంతా కూడా నిప్పులు చెరుగుతున్నారు. 49 మంది ఇండియన్ రియల్ హీరోలు చనిపోయిన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది కూడా పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ తో కాని, పాకిస్తాన్ వ్యక్తులతో కాని ఏ విషయంలో కూడా సంబంధాలు పెట్టుకునేందుకు ఇండియాలో ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికే తన సినిమాను పాకిస్తాన్ లో విడుదల చేయబోవడం లేదు అంటూ అజయ్ దేవగన్ ప్రకటించాడు. తన టోటల్ ఢమాల్ సినిమాను పాకిస్తాన్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.
ప్రస్తుతం సల్మాన్ సొంత బ్యానర్ లో రూపొందుతున్న 'నోట్ బుక్' మూవీలో పాక్ సింగర్ అతీఫ్ అస్లామ్ ఒక పాట పాడాడు. ఇప్పటికే ఆ పాటను రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ పాటను తొలగించాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడు. ఆ పాటను తానే స్వయంగా పాడాలని కూడా సల్మాన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అంతా కూడా పాక్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన వారితో సంబంధాలను కూడా పెట్టుకునేందుకు వారు ఆసక్తి చూపడం లేదు.