నన్ను ఒక పరిశ్రమ వ్యక్తి కుక్క అని సంభోధించారు. ఫర్వాలేదు.. ఆయన అన్నట్టుగానే నేను కుక్కలాగా విశ్వాసపాత్రుడిని. ఎంతో నమ్మకంగా పని చేస్తాను. నా పార్టీ వైసీపీ బాగు కోసం ఎంతకైనా తెగిస్తాను! అన్నారు 30 ఇయర్స్ పృథ్వీ. తనపై పరిశ్రమ వ్యక్తులైన అశ్వనిదత్.. పోసాని విమర్శలు గుప్పించడం వెనక ఏదో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తనకు భక్తి చానెల్ ఛైర్మన్ గా పదవి వచ్చినప్పటి నుంచి తనని కొందరు టార్గెట్ చేశారని.. పరిశ్రమలో కొందరు మాట్లాడేందుకు కూడా వెనకాడుతున్నారని పృథ్వీ అన్నారు.
తన మాట తీరు ఎగ్రెస్సివ్. పైగా నటుడిని .. రాజకీయ నాయకుడిని. ఈ కారణాల వల్ల బయటకు వెళ్లినా ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. ఇంట్లో భార్యకు కూడా చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నా.. మొన్న ఎవరో ముగ్గురు ముసుగు దొంగలు నా ముఖంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. మార్నింగ్ వాక్ కని పార్క్ కి వెళితే అలా జరిగింది. అయినా దానిని నేను ఖాతరు చేయలేదని ఎవరికీ చెప్పలేదని పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి షాకిచ్చారు.
పరిశ్రమలో పోసానికి నేను ఎంతో సన్నిహితుడిని. అన్నగారు అని పిలుస్తాను. అలాంటి ఆయనకు నాకు మధ్య గొడవలు పెట్టారు. కలతలు సృష్టించారు. ఒకే పార్టీలో ఉండి కొట్టుకుంటే దానిని క్యాష్ చేసుకోవాలని చూశారని కూడా పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. పోసానికి ఆరోగ్యం అస్సలు సహకరించలేదు. ఆ సమయంలో నేను వెళ్లి వ్యక్తిగతంగా కలిసానని అన్నారు. తనకు పదవి వచ్చినప్పటి నుంచి గొడవలు పెట్టడం మొదలైందని.. ఇప్పుడే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. అలాగే ఆర్టిస్టుగా తనకు అవకాశాలు కూడా తగ్గాయని వెల్లడించారు. పృథ్వీ ప్రస్తుతం తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు- హైదరాబాద్) కి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.