ఆడియ‌న్స్ మారినా ప్రొడ్యూస‌ర్స్ మార‌లేదా?

Update: 2022-07-13 03:30 GMT
గ‌తంలో సినిమా బ‌డ్జెట్‌, షూటింగ్ షెడ్యూల్ అంతా ప్రొడ్యూస‌ర్ కంట్రోల్లో వుండేది. ఎక్క‌డా వేస్టేజీ వుండేది కాదు. రీళ్ల‌కు రీళ్లు అన‌వ‌స‌రంగా తీసేవాళ్లు కాదు. అందుకు ప్రొడ్యూస‌ర్ ఒప్పుకునేవాడు కాదు. స్క్రిప్ట్ నుంచి సెట్ కు వెళ్లే వ‌ర‌కు ప్ర‌తీదీ నిర్మాత అండ‌ర్ కంట్రోల్ లో వుండేది.

దీంతో న‌ష్టాలు చాలా త‌క్క‌వుగా వ‌చ్చేవి. సినిమా హిట్ అంటే లాభాలు భారీగా వుండేవి, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు కూడా కొంత మొత్తం ఆనందంగా ఇచ్చేవారు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారింది అన‌డం కంటే త‌ల‌కిందులైంది అన‌డం క‌రెక్టేమో.

మారిన నిర్మాణ విలువ‌లు, పెరిగిన బ‌డ్జెట్ దీన్ని అవ‌కాశంగా తీసుకుని స్టార్ హీరోలు కోట్ల‌ల్లో పారితోషికాల‌ని డామాండ్ చేస్తుండ‌టం. అనుకున్న బ‌డ్జెట్ ఒక‌టి సెట్స్ పైకి వెళ్లాక మారే బ‌డ్జెట్ ఒక‌టి అవుతోంది. దీంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ లు ఎంత బ‌డ్జెట్ ని కంట్రోల్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నా అది కుద‌ర‌ని ప‌నిగా మారి వారికి తీవ్ర త‌ల‌నొప్పికి కార‌ణంగా మారుతోంది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన నాటి త‌రం ప్రొడ్యూస‌ర్లు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు.

ఇక స్టార్ల‌తో సినిమాలు చేయాల‌ని వారి వెంట‌ప‌డుతున్న వారు ఖ‌చ్చితంగా వారు చెప్పిన‌ట్టే చేస్తే బ‌డ్జెట్ ని అదుపుచేయ‌లేక‌, సినిమాని వ‌దులుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముందు ఈ రేంజ్ లోనే తీయాల‌ని ప్లాన్ చేసుకున్నా హీరోలు, డైరెక్ట‌ర్ల కార‌ణంగా అది సాధ్య‌ప‌డ‌టం లేదు. దీంతో తెలుగు సినిమా బ‌డ్జెట్ ఎల్ల‌లు దాటేస్తోంది. ఈ మ‌ధ్య ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం మానేశారు. టైర్ 2 హీరోల సినిమాల కోసం థియేట‌ర్ల‌కు ఎవ‌రూ రావ‌డం లేదు.

ఇది గ‌మ‌నించినా మ‌న ప్రొడ్యూస‌ర్ల‌లో మాత్రం ఇంకా మార్పు క‌నిపించ‌డం లేదు. ఆడియ‌న్స్ మారినా ప్రొడ్యూస‌ర్లు మార‌డం లేదు. త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ 75 కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా 'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ 90 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ 2.5 కోట్లు ఒక రోజుకి ఛార్జ్ చేస్తున్నార‌ట‌. వీళ్లంద‌రికి మించి ప్ర‌భాస్ దాదాపుగా 100 కోట్ల‌కు మించి పారితోషికం తీసుకుంటున్నార‌ట‌.

జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డానికి ముఖం చాటేస్తున్నా మ‌న స్టార్లు మాత్రం సినిమాల కోసం 50 నుంచి వంద కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాత‌లు అందుకు రెడీ అయిపోతున్నారు. కొంత మంది ఇప్ప‌టికే చేతుల కాల్చుకున్నారు కూడా. అయితే ఆడియ‌న్స్ లో మార్పు వ‌చ్చినా ప్రొడ్యూస‌ర్ల‌లో ఇంత వ‌ర‌కు సినిమా బ‌డ్జెట్ విష‌యంలో మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇంత జ‌రుగుతున్నా బ‌డ్జెట్ ని ఎందుకు కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నారు. ఎందుకు చేతులెత్తేస్తున్నారు అన్న‌ది ఇప్ప‌డు స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News