యువహీరో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయింది. అయితే సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. కొందరు యావరేజ్ అంటే కొందరేమో బాగలేదని తేల్చారు. మొదటిరోజు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నప్పటికీ రెండో రోజుకు భారీ డ్రాప్ కనిపించింది. విజయ్ దేవరకొండ ఇకనైనా 'అర్జున్ రెడ్డి' ప్రభావం నుంచి బయట కు రావాలనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందామని మేము ఒక పోల్ నిర్వహించాము. "వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పై మీ అభిప్రాయం ఏంటి?" అనే ప్రశ్నకు చాలా బాగుంది.. ఫర్వాలేదు.. బాగాలేదు.. ఏమో చూడలేదు ఇంకా తెలియదు అనే నాలుగు ఆప్షన్ ఇచ్చాము. ఇందులో 50.73% రీడర్స్ 'సినిమా బాగాలేదు' అని తేల్చారు. ఇక 14.53% మంది సినిమాను 'ఫర్వాలేదు' అని తమ అభిప్రాయం వెల్లడించారు. 6.89% మంది పాఠకులకు మాత్రం సినిమా తెగ నచ్చింది..అందుకే 'చాలా బాగుంది' అంటూ మెచ్చుకున్నారు. ఇంకా సినిమాను చూడలేదు అంటూ 27.86% మంది చెప్పారు.
28 శాతం మంది సినిమా చూడని వారిని పక్కనపెడితే చూసినవారు 72 శాతమే. వారిలో అధికశాతం ప్రేక్షకులు సినిమా బాగాలేదని నిర్ద్వందంగా తేల్చారు. అతి తక్కువశాతం ప్రేక్షకులు మాత్రమే సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఫర్వాలేదని చెప్పివారు కూడా కొంతమందే. దీన్ని బట్టి చూస్తే 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందని ఎవరైనా ఒక నిర్ధారణ కు రావచ్చు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ విజయ్ దేవరకొండకు ఒక వేకప్ కాల్ అని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఆ రొటీన్ అర్జున్ రెడ్డి హంగామా నుంచి బయట కు రాకపోతే ఉన్న కాస్త క్రేజ్ కూడా తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.