టాలీవుడ్ లో RRR, కేజీఎఫ్ 2 ల తరువాత ఆ రేంజ్ హిట్ వినిపించి చాలా రోజులవుతోంది. ఆ రేంజ్ హిట్ కారపోయినాఓ మోస్తరు విజయం కూడా దక్కలేదు. RRR, కేజీఎఫ్ 2 ల తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నా ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. విచిత్రం ఏంటంటే గతంలో యావరేజ్ లైనా వుండేవి కానీ ఈ మధ్య యావరేజ్ అనే మాటే వినిపించడం లేదు. అత్యధికంగా డిజాస్టర్ లే వినిపిస్తున్నాయి.
పేరున్న హీరోల సినిమాలు, క్రేజీ డైరెక్టర్ల మూవీస్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో వారం వారం విడుదలవుతున్నా ఏ ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ ఫలితాన్ని మాత్రం అందించలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. దీంతో చాలా వరకు స్టార్ ప్రొడ్యూసర్లు సైతం భారీ స్థాయిలో నష్టాలని చవిచూస్తున్న పరిస్థితి. దీనికితోడు టికెట్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో జనాలు మునుపటి తరహాలో థియేటర్లకు రావడానికి ఇష్టపడటం లేదు.
ఏపీలో అయితే చాలా వరకు థియేటర్లలో క్రేజీ కాంబినేషన్ లలో కూపొందిన సినిమాలకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ డిస్కౌంట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయినా కూడా ఆడియన్స్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఏపీలో చాలా వరకు థియేటర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. మెయింటెనెన్స్ కూడా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు లో విడుదలవుతున్న సినిమాలపై ఇప్పడు అందరి దృష్టిపడింది.
ఈ నెల అయినా టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 5 నుంచి 25 వరకు బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ముందుగా ఆగస్టు 5న రెండు సినిమాలు పోటీపడుతున్నాయి. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన `బింబిసార`, దుల్కర్ సల్మాన్ నటించిన `సీతా రామం`. ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ బజ్ వుంది. అంతే కాకుండా రెండు భిన్నమైన నేపథ్యం వున్న సినిమాలు. క్రేజీ నటులు నటించిన చిత్రాలే.
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన `బింబిసార` ట్రైమ్ ట్రావెల్ కథతో ఆద్యతం ఆసక్తికరంగా సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అంతే కాకుండా కొంత విరామం తరువాత ఈసారి ఎలాగైనా గట్టిగా కొడతాం అనే కాన్ఫిడెన్స్ తో కల్యాణ్ రామ్ వున్నారు. అంతే కాకుండా ఈసారి మిమ్మల్ని ఎట్టపరిస్థితుల్లోనూ నిరాశపరచను అని హామీ ఇస్తున్నారు. 5వ శతాబ్దానికి చెందిన త్రిగర్తలాధిపతి బింబిసారుడికి నేటి కాలానికి సంబంధం ఏంటనే ఆసక్తిని కలిగిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే వున్నాయి.
ఇక ఇదే రోజున దుల్కర్ సల్మాన్ నటించిన `సీతా రామం` రిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిందని మేకర్స్ చెబుతున్నారు. టీజర్, ట్రైలర్, లిరికల్ వీడియోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటే ఇందులోని ఓ కీలక పాత్రలో రష్మిక మందన్న నటించింది. పీరియాడిక్ ఫిక్షనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీకి దుల్కర్, రష్మిక ప్రధాన ఎస్సెట్ గా నిలుస్తున్నారు. లవ్ స్టోరీస్ ఎప్పుడూ డిజప్పాయింట్ చేసిన దాఖలాలు లేవు. అదే ఈ మూవీకి ప్రధాన ప్లస్ పాయింట్ గా మారనుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఆగస్టు 12న ఇద్దరు యంగ్ హీరోలు డిఫరెంట్ స్టోరీస్ తో రాబోతున్నారు. ఇందులో ఒకటి నితిన్ `మాచర్ల నియోజక వర్గం`. మరొకటి నిఖిల్ నటించిన `కార్తికేయ 2`. నితిన్ నటించిన `మాచర్ల నియోజక వర్గం` పక్కా మాస్ సినిమా. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్. హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్.. మాస్ ని కిక్కెక్కించే సాంగ్స్ తో నితిన్ మాంచి జోరురు చూపిస్తున్నాడు. మాస్ లో చిన్న టాక్ వినిపించినా సినిమా రేంజ్ మారిపోతుంది. హిట్టుబాట పట్టొచ్చు.
ఇక నిఖిల్ నటించిన `కార్తికేయ 2` సూపర్ నేచురల్ మిస్టికల్ థ్రిల్లర్. గతంలో వచ్చిన `కార్తికేయ` సూపర్ హిట్ అనిపించుకోవడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న `కార్తికేయ 2` పై మంచి బజ క్రియేట్ అయింది. అనుపమ్ ఖేర్ తొలిసారి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. అంతే కాకుండా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో నిఖిల్ ఈ సారి కూడా హిట్టు కొట్టడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆగస్టు చివరలో 25న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ `లైగర్` వచ్చేస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశారు. ముంబైలో వరుస ఈవెంట్ లని నిర్వహిస్తూ అక్కడ భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. పూరీ కూడా మంచి ఫామ్ లో వుండటం, వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించడం, మదర్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ పాత్రని మలిచిన తీరు సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేసింది.
పాజిటివ్ టాక్ వచ్చిందా సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సినిమాలతో పాటు మరి కొన్ని ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ సినిమాల్లో రెండు మూడు హిట్టయినా మళ్లీ టాలీవుడ్ పుంజుకుంటుంది. ఇదే ఆశతో అంతా ఆగస్టులో రానున్న సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల్లో ఏ మూవీ మ్యాజిక్ చేస్తుందో ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.