స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ర్యాపిడో యాడ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆటోవాలా సంఘాల్ని కించపరిచినట్లు ఉందని కార్మిక సంఘాలు భగ్గుంటున్నాయి. ఓ పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటి ప్రకటనల్లో నటించడం మోటార్ రంగంలో ఉన్న వారి ఉపాధికి గండికొట్టినట్లు అవుతుందని ఆవేదన చెందుతున్నారు. తాజాగా విశాఖపట్టణం ఆటో సంఘాలు బన్నీ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాయి. మేమంతా మెగా అభిమానులం. మెగా కుటుంబం నుంచి ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఎంతో ఆరాధిస్తాం. చిరంజీవి గారు ఉన్నారు... కాబట్టే ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు పుట్టుకొచ్చారు.
ఆయన వల్ల మీలాంటి వాళ్ల సినిమాల్ని ఆదరిస్తున్నాం. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. నాగబాబు.. రామ్ చరణ్ ఇలా ఎంత మంది వచ్చినా మెగా అభిమానులం.. ఆ కుటుంబాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. కానీ అల్లు అర్జున్ నటించిన ఆటో యాడ్ తమని కించపరిచినట్లుగా ఉందని ఆవేదన చెందారు. తమ లాంటి వారి జీవితాల గురించి కూడా అర్జున్ ఆలోచించి ఇలాంటి ప్రకటనల్లో నటించాలని కోరారు. స్టైలిష్ స్టార్ అనేది ఆయన పెట్టుకోలేదు. ప్రేక్షకాభిమానులంతా కలిసి ఇచ్చిన బిరుదు అది. ఆ విషయం బన్నీకి ఎప్పటికీ మర్చిపోకూడదు. బన్నీ నటించిన యాడ్ ఏపీలో ఉన్న ప్రతీ ఆటో సంఘం తీవ్రంగా ఖండిస్తుంది.
ఇప్పటికే ఆటోవాల జీవితాలు చిద్రంగా మారిపోతున్నాయి. ఓలా.. ఊబర్ వంటి ఆన్ లైన్ యాప్ లు రావడంతో తమ బిజినెస్ ఎంతో పడిపోయింది. ఇలాంటి సమయంలో ఇలాంటి యాడ్లు తమకి బ్రతుకు తెరువు లేకుండా చేస్తున్నాయని ఆటో సంఘాలు మండిపడ్డాయి. మరి వీటిపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మెగా ఫ్యామిలీకి అభిమానులే బలం కాబట్టి బన్నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అలాగే ర్యాపిడో యాడ్ నుంచి కూడా ఆయన తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ పుష్ప లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.