సెన్సారోళ్లను కలవలేదన్న హీరో

Update: 2017-04-17 07:13 GMT
అవసరాల శ్రీనివాస్ నటించిన ‘బాబు బాగా బిజీ’ ఏప్రిల్ 13 రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ సెన్సార్ వాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. సెన్సార్ సమస్యను అధిగమించి సినిమాను బయటికి తేవడం కోసం మే 5కు కొత్త డేట్ ఫిక్స్ చేసుకుంది చిత్ర యూనిట్. ఐతే ఈ విషయంలో మరీ ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ సినిమాకు సెన్సార్ తంతు పూర్తయింది. ‘ఎ’ సర్టిఫికెట్ తో ఈ సినిమాను క్లియర్ చేశారు. మరి సెన్సార్ వాళ్లు ఇంతకుముందు అభ్యంతర పెట్టిన సన్నవేశాన్ని చిత్ర బృందం తొలగించిందా.. లేక దాన్ని రీషూట్ చేసి అభ్యంతరం లేని విధంగా మార్చాక క్లియరెన్స్ వచ్చిందా  అన్నది తెలియదు.

ఐతే సెన్సార్ వాళ్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాక హీరో అవసరాల శ్రీనివాస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడని.. అతను పలుమార్లు సెన్సార్ అధికారుల్ని కలిసి వాళ్లకు సర్దిచెప్పి.. ఈ సినిమాను క్లియర్ చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై అవసరాల స్పందించాడు. అలాంటిదేమీ లేదన్నాడు. ‘‘ఏ హీరో అయినా సెన్సార్ వాళ్లను తన సినిమా కోసం కలవడం గురించి ఎప్పుడైనా కలవడం విన్నారా..? నేను మాత్రం ఎందుకు కలుస్తాను. ఇదంతా ఉత్త ప్రచారం’’ అంటూ నవ్వేశాడు అవసరాల. మొత్తానికి ఎలాగైతేనేం సినిమా అయితే బయటపడిపోయింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చిన వారానికే థియేటర్లలోకి దిగేయబోతోంది ‘బాబు బాగా బిజీ’. నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘హంటర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News