ఇకపోతే మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా.. ''జ్యో అచ్యుతానంద''. ఇప్పటికే హీరోయిన్ రెజీనాతో అటు నారా రోహిత్ ఇటు నాగ శౌర్య చేసిన రొమాన్స్ కారణంగా టీజర్లతోనే ఫుల్ కిక్ వచ్చేసింది. పాటలు కూడా మెలోడియస్ గా బాగున్నాయి. ఇకపోతే ఇద్దరు అన్నదమ్ముల కథ అని చెప్పడంతో ఎక్కడలేనంత హైప్ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి ఒక మేజర్ ట్విస్టు చెప్పేశాడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల.
''నారా రోహిత్ అచ్యుత్ పాత్రలో - నాగశౌర్య ఆనంద్ గా - రెజీనా జో పాత్రలో కనపడతారు. ఇద్దరు హీరోలకు అల్రెడి పెళ్లై పోయుంటుంది. వారి జీవితంలోకి రెజీనా ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేదే సినిమా. పూర్తి ప్రేమ కథా చిత్రమైతే కాదు. ప్రేమ వల్ల అన్నదమ్ములు కలుస్తారు - విడిపోతారు - చివరకు కలిసిపోతారు'' అంటూ వివరించాడు అవసరాల. అయితే ఇక్కడే ఒక ట్విస్టు కూడా ఉందండోయ్. సినిమా ఫస్టాఫ్ అంతా కూడా.. 2010-11 ప్రాంతంలో జరిగే కథ అంట. సెకండాఫ్ అంతా 2016లో నడుస్తుందట. అయితే ఫస్టాఫ్ లో ఈ హీరోలిద్దరి ప్రేమ కథలు.. వారి పెళ్ళిళ్ళూ.. ఇలా చాలా కథే ఉంది. మొత్తానికి రియాల్టీకి దగ్గర్లో ఉండే డిఫరెంట్ సినిమా చూపించబోతున్నాడు ఈ దర్శకుడు.
అయితే ఈ వివరాలన్నీ చెప్పేశాక.. ఖచ్చితంగా ఇటు రోహిత్ కాని అటు శౌర్య కాని రెజీనాను చివరకు పెళ్ళి చేసుకోరని అర్దమవుతోంది. ఇలా ట్విస్టును రివీల్ చేసేస్తే మరి అవసరాలకు భయం ఏం లేదంటారా? అబ్బే.. సినిమాలోని రొమాంటిక్ మూమెంట్స్ చంపేస్తాయ్ అంటున్నాడు.