ఇద్దరూ అష్టాచమ్మాతోనే నటులుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆ చిత్రంతో నాని కథానాయకుడిగా నిలబడిగాపోగా, అవసరాల శ్రీనివాస్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. అప్పటినుంచి వీరిద్దరి కెరీర్లు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. అవసరాల మధ్యలో దర్శకుడిగా కూడా మారాడు. నాగశౌర్యతో ఊహలు గుసగుసలాడే తీసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీబిజీగా కొనసాగుతున్నాడు. మధ్యమధ్యలో మంచి కథల్నిరెడీ చేసుకొంటూ మెగాఫోన్ పట్టే అవసరాల తాజాగా జో అచ్యుతానంద అనే సినిమాని తీస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే నానిని డైరెక్ట్ చేయబోతున్నాడట.
ఆ విషయాన్ని జెంటిల్ మన్ ఆడియో ఫంక్షన్ లో స్వయంగా నాని ప్రకటించాడు. హీరోనే చెప్పాడంటే ఇక ఆ సినిమా ఖాయమైనట్టే. ఈ కాంబినేషన్ ఆసక్తిగానే ఉంది కదూ! సున్నితమైన కథలతో సినిమాలు తీసే అవసరాల మరి నానిని ఎలాంటి కథలో చూపిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాస్ నేపథ్యంతో కూడిన కథల్లోనూ నాని కనిపిస్తున్నాడు. మరి నాని కోసం అవసరాల మాస్ కథనే తయారు చేశాడేమో చూడాలి. నానిని కథానాయకుడిగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలోనే జెంటిల్ మన్ తెరకెక్కింది. ఆ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకొస్తున్నట్టు ప్రకటించాడు నాని. నాలోని హీరోని చూసిన ఇంద్రగంటిగారే విలన్ ని కూడా చూశారని, అందుకే విలన్ గా నన్ను ఈ సినిమాలో చూపించాడని తెలిపారు నాని.