జేమ్స్ కామరూన్ విజువల్ వండర్ `అవతార్-2` రిలీజ్ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎంత ఆసక్తిగా దెరుచూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. `అవతార్` లో పండోరా గ్రహాన్ని సృష్టించిన కామెరూన్ `అవతార్-2` తో మరో కొత్త ప్రపంచంలోకే తీసుకెళ్లబోతున్నారు. అండర్ వాటర్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా అంతా ఉంటుంది. `అవతార్` ని మించి `అవతార్ -2` ఉండబోతుంది? అన్న అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. డిసెంబర్ 16-2022లోనే రిలీజ్ చేస్తున్న వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ ఉంది కాబట్టి...ఏప్రిల్..మే నుంచి ఆ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
ఇటీవలే `అవతార్` కపుల్స్ జేక్ సల్లీ-నేతిరి ఫ్యామిలీ నిర్మాతలు పరిచయం చేసారు. నలుగురు పిల్లలు కల్గిన జంటగా అవతార్ ఫ్యామిలీ తెరపై కనిపించనుంది. అందులో ఓ కుర్రాడిని స్పైడర్ గా పరిచయం చేసారు. అంటే `అవతార్ -2`లో కపుల్స్ పాత్రతలతో పాటు వాళ్లకి సంబంధించిన పిల్లలు..బంధువుల పాత్రల్ని సైతం ఎంతో అద్భుతంగా తీర్చి దిద్ది ఉంటారనే తెలుస్తుంది. అండర్ వాటర్ ఈ ఫ్యామిలీ ప్రత్యర్ధులతో చేసే పోరాటాలు హైలైట్ గా ఉంటాయని ఊహించొచ్చు. ఇప్పటికే `అవతార్-2`..`అవతార్ -3` భాగాలకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇంకా మరో రెండు భాగాలుగా `అవతార్4-5` గాను ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఒక్కో భాగానికి 1900 కోట్ల బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్నారు. అంటే మొత్తం నాలుగు `అవతార్` ప్రాంచైజీలకు కలిపి11300 కోట్లు ఖర్చు అవుతుంది. అవతార్ ప్రాంచైజీ నుంచి వచ్చే సినిమాలన్ని రెండేళ్ల గ్యాప్ లో ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయి. వాస్తవానికి అవతార్-2 ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత 2024..26..28 మిగతా భాగాలు రిలీజ్ అవుతాయి.