'అవ‌తార్-2' రివ్యూ వ‌చ్చేసింది..టాక్ ఇలా ఉంది

Update: 2022-12-07 10:30 GMT
జేమ్స్ కామెరూన్ విజువ‌ల వండ‌ర్ 'అవ‌తార్ -2 ది వే ఆఫ్ వాట‌ర్' కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జైట్  మెంట్ తో ఎదురు చూస్తోన్న  చిత్రం. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఉత్సాహం రెట్టింపు అయింది. రిలీజ్ తేదీ డిసెంబ‌ర్ 16 ఎప్పుడొస్తుందా? అని ప్ర‌పంచ‌మంతా ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తుంది. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఏ సినిమా విష‌యంలో ఇంత‌టి ఎగ్జైట్ మెంట్ క‌నిపించ‌లేదు.

గ‌త ఆరు  నెల‌ల నుంచైతే? 'అవ‌తార్ 2' వార్త‌లు మీడియాలో రోజు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొస్తూనే ఉన్నాయి. సినిమా ఎలా ఉండ‌బోతుంది? అవ‌తార్ ని మించిన అద్భుత‌మైన సృష్టి ఉండ‌బోతుందా?  నీటి గ‌ర్భంలో చేస్తోన్న తొలి ప్ర‌య‌త్నం  ఎలా ఉంటుంది? అన్న న‌రాలు తెగే  ఉత్కంఠ‌త  అభిమానుల్లో క‌నిపిస్తుంది. పైగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా $2 బిలియన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బ‌రిలోకి  దిగుతుంది. దీంతో  సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో  తాజాగా  సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.  'అవతార్ 2'  వ‌ర‌ల్డ్  ప్రీమియర్ లండన్‌లో పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సమీక్షలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 'అవతార్ అని చెప్పడానికి ఎంతో  సంతోషిస్తున్నాను: నీటి మార్గం అసాధారణమైనది. అవతార్ 1 కంటే పెద్దది .. ఉత్తమమైనది మరింత భావోద్వేగం తో కూడిన క‌థ అవ‌తార్-2 అని ఒక ప్రముఖ హాలీవుడ్ విమర్శకుల ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే... 'జేమ్స్ కామెరాన్‌పై సందేహ ప‌డాల్సిన ప‌నేలేదు. ఇలాంటి చిత్రాలు తెర‌కెక్కిచ‌డంలో ఆయ‌నో లెజెండ్. అతని రివర్టింగ్ ..స్టోరీ టెల్లింగ్ మరియు  విఎఫ్ ఎక్స్...సీజీఐ ప్ర‌తీది అత‌ని స్థాయిని...సినిమా స్థాయిని  పెంచాయి. పండోర గ్ర‌హాన్ని మించి  ఉత్కంఠభరితంగా .

అందంగా ఉంది.  నేను ఇంతకు ముందు ఇలాంటి   స్క్రీన్‌పై ఉన్న  సినిమా చూడ‌లేదు. ఇదొక విజువ‌ల వండ‌ర్' అని అన్నారు. ఇంకా ఈ  సినిమాకి హాలీవుడ్ నుంచి అన్ని పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి.   3 గంటల-10 నిమిషాల నిడివి గల  ఓ సెల్యులాయిడ్ ఇది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News