ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించి అద్భుతమైన లోకానికి తీసుకు వెళ్లిన చిత్రం 'అవతార్'. గ్రాఫిక్స్ ఎక్కువగా అందుబాటులోకి రాని సమయంలోనే అవతార్ ను విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ ఇప్పుడు మరింత గా మెరుగులు దిద్దుకుని సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
అవతార్ 2 ను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. అవతార్ విడుదల అయ్యి 13 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్లు 25 ఏళ్లు ఉన్న వారు అవతార్ వచ్చిన సమయంలో చిన్నపిల్లలు. వారు సినిమా ను టీవీలో చూసి ఉంటారు.
కానీ అవతార్ ను వెండి తెరపై చూస్తేనే కిక్ ఉంటుంది. అందుకే వారి కోసం అన్నట్లుగా అవతార్ మొదటి పార్ట్ ను రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 23వ తారీకున దేశ వ్యాప్తంగా వందలాది స్క్రీన్స్ లో అవతార్ రీ రిలీజ్ చేయబోతున్నారు.
డిసెంబర్ లో రాబోతున్న అవతార్ 2 సినిమాను మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులు అవతార్ ను చూసేందుకు క్యూ కట్టే అవకాశం ఉంది. అందుకే సెప్టెంబర్ లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఇప్పటికే వందల సార్లు టీవీలో వచ్చింది. ప్రాంతీయ భాషల్లో కూడా సినిమా ను టెలికాస్ట్ చేశారు.
ఇక ఓటీటీ లో కూడా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయినా కూడా థియేటర్ల ద్వారా అవతార్ ను చూసేందుకు జనాలు క్యూ కట్టడం ఖాయం. ఎందుకంటే ఆ సినిమా యొక్క గొప్పతనం అది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అవతార్ 2 వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటున్న సినీ ప్రేమికులకు వచ్చే నెలలోనే అవతార్ సర్ ప్రైజ్ చేయబోతున్న నేపథ్యంలో ఆనందంతో గంతులు వేస్తున్నారు.
అవతార్ సినిమా ను మరో పదేళ్ల తర్వాత చూసినా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి అవతార్ కు మరింత టెక్నాలజీ జోడించి 4కే పిక్చర్ రెజల్యూషన్ తో వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు. అవతార్ 2 కి మరింత బజ్ పెంచేందుకు అవతార్ ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.